ఘనంగా జరిగిన కపట నాటక సూత్రధారి ప్రీ రిలీజ్ ఈవెంట్..నవంబర్ 12న సినిమా విడుదల..!!

  • November 10, 2021 / 05:37 PM IST

విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘కపట నాటక సూత్రధారి’. క్రాంతి సైనా దర్శకత్వం వహించిన ఈ సినిమా కి మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరించారు. సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందించాడు. రామ్ తవ్వ సంగీతం, రామకృష్ణ మాటలు అందించారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 12 న విడుదల కాబోతుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి , నాంది మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.. టైటిల్ చాలా బాగుంది. ఇన్ని రోజులు ఇంత మంచి టైటిల్ ఎలా వదిలేశారని పించింది. డైరెక్టర్ క్రాంతి ఎంతో కష్టపడి ఈ సినిమా ను తెరకెక్కించారు. నిర్మాతలు దేనికి కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ను ఇంత బాగా తెరకెక్కించడం సంతోషంగా ఉంది. చిత్రంలో నటించిన అందరు నటీనటులు, పనిచేసిన టెక్నీషియన్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు.

నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. ఈ సినిమా చేసిన దర్శక నిర్మాతలకు అల్ ది బెస్ట్. దర్శకుడు క్రాంతి నాకు చాలా సన్నిహితుడు. మేమిద్దరం ఎన్నో సినిమాలు కలిసి చేశాం. ఇప్పుడు నా స్నేహితుడు దర్శకుడు కావడం అందంగా ఉంది. నిర్మాత మనీష్ కూడా నా ఆప్త మిత్రుడు.. వీరిద్దరూ ఓ మంచి సినిమా తో మీ ముందుకు వస్తున్నారు. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అన్నారు.

నటుడు సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. శివారెడ్డి గారి సోదరుడిగా సినిమాలలోకి వస్తున్నాను. శివారెడ్డి గారి అన్ని పనులు చూస్తున్నాను. అప్పుడప్పుడు నేనెప్పుడూ స్టేజి ఎక్కుతాను అని అనుకునేవాడిని.. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. నేను ఇంతవరకు రావడానికి కారణం అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ చిత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి అలరిస్తుందన్న నమ్మకం నాకుంది. నవంబర్ 12 న తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అన్నారు.

నటి ఇందు మాట్లాడుతూ.. ఇక్కడి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. నన్ను నమ్మి ఈ పాత్ర కు నన్ను ఎంపిక చేసినందుకు క్రాంతి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి చెప్పాలంటే షూటింగ్ ఎంతో సరదాగా జరిగింది. అందరికీ నటించడం ఎంతో కంఫర్ట్ గా ఉంది. సక్సెస్ మీట్ లో తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాం అన్నారు.

హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కి నన్ను హీరో గా ఎంపిక చేసి అవకాశం ఇచ్చిన దర్శకుడికి, నిర్మాతకి కృతజ్ఞతలు. కపట నాటక సూత్రధారి గురించి చెప్పాలంటే ఇది చాలా మంచి కథ. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. దర్శకుడు ఎంతో కష్టపడి ఈ సినిమా ను తెరకెక్కించాడు. నిర్మాతలు ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడలేదు. నవంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది నమ్ముతున్నాను.

దర్శకుడు క్రాంతి మాట్లాడుతూ.. ముందుగా నన్ను నా కథ ను నమ్మి ఈ సినిమా ను ఇంత వరకు తీసుకొచ్చిన నిర్మాత గారికి కృతజ్ఞతలు. కథ మీద నమ్మకం తోనే ఈ సినిమా కు ఎంత ఖర్చు పెట్టారు. నిజంగా అంత మంచి ప్రొడ్యూసర్ దొరకడం నా అదృష్టం. హీరో విజయ్ శంకర్ పాత్ర కి తగ్గట్టు చాలా బాగా నటించాడు. ఈ సినిమా ఇంత దూరం రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అన్నారు.

నిర్మాత మనీష్ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఆశీర్వదించటానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా ను ఎంతో కష్టపడి చేశాను. కథ వినగానే ఈ సినిమా ను ప్రొడ్యూస్ చేయాలనిపించింది. దర్శకుడు కథ చెప్పిన విధానం, తెరకెక్కించిన విధానం ఎంతో ఆకట్టుకుంది. హీరో విజయ్ శంకర్ ఈ సినిమా తో బాగానే ఆకట్టుకుంటాడు. అందరూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తారని నమ్మకం ఉంది. అన్ని విభాగాల టెక్నిషియన్స్ చాలా బాగా పని చేశారు. ఈ సినిమా ను నవంబర్ 12 న ఈ సినిమా చూసి హిట్ అందించాలని కోరుకుంటున్నాను అన్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus