మోస్ట్ పాపులర్ & హాటెస్ట్ యాంకర్ ఆఫ్ టీవీ & సిల్వర్ స్క్రీన్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “కథనం”. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. “రంగస్థలం” అనంతరం అనసూయ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రమిదే కావడం విశేషం. మరి ఈ సినిమాతో అనసూయ హిట్ కొట్టిందా లేదా అనేది చూద్దాం..!!
కథ: డైరెక్టర్ అవ్వడమే ధ్యేయంగా బ్రతికే అను (అనసూయ), యాక్టర్ అవ్వడంతోపాటు తన స్నేహితురాలు డైరెక్టర్ అవ్వడం తన ధ్యేయంగా మార్చుకున్న ధన (ధనరాజ్) క్లోజ్ ఫ్రెండ్స్. ఒకే రూమ్ లో ఉంటూ.. ఒకే కంచంలో తింటూ ఉంటారు. చాలామందికి కథలు చెప్పి చెప్పి విసిగిపోయిన అనుకి.. ఓ నిర్మాతల త్రయం తమ దగ్గర ఒక కథ ఉందని.. దాన్ని డైరెక్ట్ చేయమని కోరతారు. డైరెక్షన్ ఛాన్స్ రావడంతో వచ్చిన అవకాశాన్ని వెంటనే అంగీకరిస్తుంది అను. ఆ నిర్మాతల త్రయం ఇచ్చిన క్రైమ్ థ్రిల్లర్ కు తాను స్క్రీన్ ప్లే రాసుకొంటుండగా.. అచ్చు అలానే నిజజీవితంలోనూ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి.
అసలు అను రాసుకొనే కథనం నిజజీవితంలో సంఘటనలకు సంబంధం ఏమిటి? ఈ మిస్టరీని పోలీస్ ఆఫీసర్ రణధీర్ తో కలిసి ఆ మిస్టరీని ఎలా చేధించించి అనేది “కథనం” కథాంశం.
నటీనటుల పనితీరు: అనసూయ గ్లామర్ కంటే నటన మీద ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసింది. రెండు విభిన్నమైన షేడ్స్ చేసింది కానీ.. పెద్దగా వేరియేషన్స్ చూపించలేదు. నటిగా మాత్రం మంచి మార్కులు సంపాదించింది. అయితే.. ఆమెను మరీ చిన్న అమ్మాయిలా చూపించడానికి చేసిన ప్రయత్నం మాత్రం అనసూయ లుక్స్ కారణంగా కాస్త బెడిసికొట్టిందనే చెప్పాలి.
చాలారోజుల తర్వాత ధనరాజ్ కు ఒక చక్కని పాత్ర లభించింది. బాగానే యుటిలైజ్ చేసుకొన్నాడు ధనరాజ్. వెన్నెలకిషోర్-ధనరాజ్ కాంబినేషన్ ఎపిసోడ్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్.
పోలీస్ ఆఫీసర్ గా రణధీర్ నటన బాగుంది కానీ.. డబ్బింగ్ సూట్ అవ్వలేదు. పృద్వీ, అవసరాల శ్రీనివాస్ లు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: రోషన్ సాలూరి సంగీతం సోసోగా ఉన్నా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ మాత్రం డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వేల్యూస్ మరీ పేలవంగా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు మరీ షార్ట్ ఫిలిమ్స్ ను తలపించాయి.
దర్శకుడు రాసుకున్న కథలో కొత్తదనం ఉంది కానీ.. కథనంలో అది లోపించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో థ్రిల్ కానీ సెంటిమెంట్ కానీ కనిపించలేదు. పైగా.. జస్టిఫికేషన్ కానీ క్లైమాక్స్ ముగింపు కానీ చాలా ఆర్టిఫీషియల్ గా ఉంటాయి. ధనరాజ్-వెన్నెలకిషోర్ ల కామెడీ బాగున్నా.. అదేదో స్పెషల్ బ్లాక్ లా గ్యాప్ లేకుండా సాగడం తర్వాత ఆ పాత్రలు కనుమరుగవ్వడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ & ఇంటరాగేషన్ ఎపిసోడ్స్ కూడా మరీ పేలవంగా ఉండడం సినిమాకి మైనస్.
విశ్లేషణ: నటిగా అనసూయ ఆకట్టుకున్నా.. దర్శకుడి విజన్ & ప్రొడక్షన్ వేల్యూస్ మరీ పేలవంగా ఉండడంతో ఈ “కథనం” ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో విఫలమైందనే చెప్పాలి.