Katrina Kaif: మరో 20 ఏళ్లు ఇలాగే ఉండాలి.. కత్రినా కైఫ్ లేటెస్ట్ పోస్ట్ వైరల్..!

సొగసైన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది బాలీవుడ్ భామ కత్రినా కైఫ్. పెళ్లి తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ జోరు తగ్గలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో గ్లామర్ డోస్ రెట్టింపు చేసి హాట్ ఫోజులతో మనసు దోచేస్తుంది. వరుస సినిమా ఆఫర్స్‌తో ఈ సుందరాంగి మయ దూకుడుగా ఉంది. 2021 లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ భామ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ వేసింది.

గత 20 ఏళ్లగా తన లైఫ్‌లో ఎక్కువ సమయం అతనితో ఉన్నాను అంటూ చెప్పుకొస్తూ ఒక ఫోటో షేర్ చేసింది. ఇక ఆ ఫోటో చూసిన నెటిజెన్స్ ఆ వ్యక్తి ఎవరు అంటూ నెట్టింట తెగ వెతికేస్తున్నారు. కత్రినా ఏమి రాసుకొచ్చింది అంటే.. “గత 20 ఏళ్లగా నేను అశోక్ శర్మతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. నన్ను మోటివేట్ చేయడం, నవ్వించడం, నాతో గొడవ పడడం, నన్ను సరైన దారిలో నడిపించడం, నన్ను కాపాడుకోవడం.. ఇలా ప్రతి దానిలో ఆయన ఉన్నారు.

ఎప్పుడు నన్ను ఒక కంట కనిపెట్టుకుంటూ నాకు ఏమి కావాలో ముందుగానే ఏర్పాటు చేస్తూ నాతో నడుస్తూ వస్తున్నారు. మరో 20 ఏళ్ళ పాటు కూడా ఇది ఇలాగే కొనసాగాలి” అంటూ పేర్కొంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే.. కత్రినా పర్సనల్ అసిస్టెంట్ అశోక్ శర్మ. కత్రినా కెరీర్ 2003 లో మొదలైంది. అప్పటి నుంచి ఆమెతో పాటు అశోక్ శర్మ కొనసాగుతూ వస్తున్నాడు.

ఇక కత్రినా (Katrina Kaif) ప్రెజెంట్ సినిమా ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్‌తో టైగర్ 3 సినిమాలో నటిస్తుంది. విజయ్ సేతుపతితో కలిసి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ‘మెర్రీ క్రిస్మస్‌’ అనే క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తుంది. అలాగే ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న ‘జీ లే జరా’లో ప్రియాంక చోప్రా మరియు అలియా భట్‌ లతో కలిసి కత్రినా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus