Keerthy Suresh, Samantha: సమంత వ్యాధి గురించి కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం పాలైనట్లు శనివారం నాడు తెలిపిన సంగతి తెలిసిందే. కొన్నినెలలుగా ఆమె మాయోసిటీస్‌ అనే వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి సోకిన వారికి కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, నడవలేకపోవడం,ఎక్కువగా నీరసంగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే తన వ్యాధి పూర్తిగా నయం అయ్యాక అభిమానులతో చెప్పుకోవాలి అని మొదట సమంత అనుకుందట. కాకపోతే అందుకు ఇంకా టైం పట్టేలా ఉందని వైద్యులు తెలపడంతో..

అభిమానులతో పంచుకోకుండా ఉండలేకపోయినట్టు సమంత చెప్పుకొచ్చింది. తన లైఫ్ లో మంచి, చెడు రెండు దశలు చూశాను అని.. అయితే అవి వేగంగా గడిచిపోయినట్టు ఇది కూడా వేగంగా గడిచిపోతుంది అని భావిస్తున్నట్టు ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేసింది. సమంత ఎమోషనల్ పోస్ట్ చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎప్పుడూ మొహం పై చిరు నవ్వుతో చాలా పాజిటివ్ గా ఉండే సమంత..

ఇలా అయిపోవడం ఏంటి అని అంతా టెన్షన్ పడుతున్నారు. సమంత పోస్ట్ కు ఎన్టీఆర్, చిరంజీవి, కాజల్ అగర్వాల్, శ్రియ వంటి వారు స్పందించి కంగారు పడొద్దు అంటూ ధైర్యం చెప్పారు. తాజాగా కీర్తి సురేష్ కూడా స్పందించి సమంతని ఓదార్చే ప్రయత్నం చేసింది. ‘నీకు డబుల్ ఎనర్జీ వస్తుంది.

మరింత దృఢంగా తిరిగి వస్తావని భావిస్తున్నాను’ అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. వీళ్ళిద్దరూ గతంలో ‘మహానటి’ ‘మన్మథుడు 2’ వంటి చిత్రాల్లో నటించారు. వీళ్లకు ఆ సినిమాల్లో కాంబినేషన్ సీన్స్ ఉండవు కానీ విడి విడిగా ఒకే సినిమాలో కనిపించడం జరిగింది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus