2018లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ పై కూడా మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్ 2’ ని తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. రాకింగ్ స్టార్ యష్ హీరోయిజం, దర్శకుడు ప్రశాంత్ నీల్ మాస్ టేకింగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి.
టీజర్, ట్రైలర్ లకి తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడంతో ‘కె.జి.ఎఫ్ 2’ కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. విజయవంతంగా 16 రోజులు పూర్తిచేసుకున్న ఈ మూవీ ‘ఆచార్య’ విడుదలైనా దూకుడు తగ్గించలేదనే చెప్పాలి.’ఆంధ్ర’ లో ఈ మూవీ టికెట్ రేట్ల ఇష్యు వల్ల నలిగిపోయింది.అక్కడ తప్ప నైజాంలో ఈ మూవీ భారీ లాభాలను అందించింది. ఒకసారి ‘కె.జి.ఎఫ్ 2’ 16 రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
40.71 cr
సీడెడ్
10.79 cr
ఉత్తరాంధ్ర
7.17 cr
ఈస్ట్
5.31 cr
వెస్ట్
3.26 cr
గుంటూరు
4.32 cr
కృష్ణా
3.96 cr
నెల్లూరు
2.54 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
78.06 cr
‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజులకు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ 16వ రోజులు పూర్తయ్యేసరికి రూ.78.06 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఈ రికార్డ్ ‘2.o’ పేరుతో ఉండేది.కానీ ఆ మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు.
కానీ ‘కె.జి.ఎఫ్ 2’ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయడమే కాకుండా రూ.3.06 కోట్ల లాభాలను అందించింది. కాకపోతే ఆంధ్రాలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు. అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అక్కడ ఈ చిత్రానికి రూ.49 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటివరకు కేవలం రూ. 37.35 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. కాకపోతే నిన్న ‘ఆచార్య’ విడుదలైనప్పటికీ ఈ మూవీ స్టడీగా రాణిస్తుంది.’ఆచార్య’ కి దక్కిన టికెట్ రేట్ల హైక్ ‘కె.జి.ఎఫ్’ కు దక్కి ఉంటే ఈ మూవీ కచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధించేది.