కె.జి.ఎఫ్ చాప్టర్ 1, కె.జి.ఎఫ్ చాప్టర్ 2… చిత్రాలు దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ లకు పాన్ ఇండియా ఇమేజ్ లభించింది. కే. జి.ఎఫ్ చాప్టర్ 2 అయితే ఏకంగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం కంటే ఎక్కువగా కలెక్ట్ చేసి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ.1200 కోట్ల పైనే గ్రాస్ వసూళ్ళను రాబట్టింది. కే.జి.ఎఫ్ లో నటించిన నటీనటులందరూ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ చిత్రంలో ప్రతి ఒక్క నటుడికి మంచి పాత్ర పడింది. దీంతో వాళ్ళు తెలుగు సినిమాల్లో కూడా బిజీ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సహాయ నటుడి పాత్ర చేసిన హరీష్ రాయ్ ను కూడా అంత ఈజీ గా మర్చిపోలేరు. రాఖీ బాయ్ కు సపోర్ట్ గా ఉండే పాత్ర చేశారు ఆయన. ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ లో హరీష్ రాయ్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఈయన గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అనే డౌట్ మీకు రావచ్చు.
ప్రస్తుతం ఈయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. బెంగుళూర్ లోని కిడ్వాయి ఆసుపత్రిలో ప్రస్తుతం ఈయన చికిత్స పొందుతున్నారు. ఈయనకు మేజర్ సర్జరీ చేయాల్సి ఉందట. ఈయనకు ఊపిరి తిత్తుల సమస్య కూడా ఎక్కువగా ఉందని.. శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంది అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈయన ట్రీట్మెంట్ కు చాలా డబ్బులు అవసరం పడుతుందట. అంత డబ్బు ఈయన దగ్గర లేదు అని ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు కన్నడ ఫిల్మ్ మీడియా వర్గాల సమాచారం.