Archana Jois: నటి అర్చనా జోయిస్‌కు అరుదైన గౌరవం..!

‘కె.జి.ఎఫ్'(సిరీస్) లో రాఖీ బాయ్ తల్లిగా నటించిన వ్యక్తి గురించి ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె పేరు అర్చనా జాయిస్ కాగా ఆమె కోలారుకు చెందిన నటి. సినిమాలో ఆమె పాత్ర కనిపించేది కాసేపే అయినా సినిమా మొత్తం నడిచేది ఆమె పాత్ర వల్లనే అని చెప్పాలి. ఈమెతో కూడా పవర్ ఫుల్ డైలాగులు చెప్పించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ‘తందానే తానే’ అనే మ్యూజిక్ వచ్చిన ప్రతీసారి జనాలకు ఈమెనే గుర్తుకు వస్తూ ఉంటుంది.

Click Here To Watch NOW

ఈమె వయసు కేవలం 27 సంవత్సరాలే కాగా..సినిమాలో హీరోకి యంగ్ ఏజ్ లో చనిపోయే మదర్ గా కనిపించింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమెకు సన్మానం జరగడంతో మరోసారి అర్చనా జోయిస్‌ ట్రెండింగ్ లో నిలిచింది. బుధవారం నాడు నగరంలోని సపలమ్మ దేవాలయ సమితి ఈమెను ఘనంగా సత్కరించింది. నగరసభ సభ్యుడు మురళీగౌడ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘అర్చనా జోయిస్‌ తన నటనతో జిల్లాకి మంచి పేరుని తెచ్చిపెట్టింది.

అంతేకాదు జిల్లా ఖ్యాతిని కూడా ప్రపంచవ్యాప్తంగా పెంచింది. ఈ కార్యక్రమంలో కార్తీక్, సత్యనారాయణ, నవీన్‌బాబు వంటి వారు పాల్గొన్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 14న విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. కన్నడ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా.. ఇంకా చెప్పాలి అంటే అక్కడికి మించి హిందీ, ఓవర్సీస్ లో కలెక్ట్ చేస్తుంది.

తమిళంలో అయితే రెండో వీకెండ్ కు గాను మరో 200 స్క్రీన్లు పెంచాలని అక్కడి థియేటర్ యాజమాన్యాలు భావిస్తున్నాయి. ‘బీస్ట్’ ప్రదర్శింపబడుతున్న చాలా థియేటర్లను ‘కె.జి.ఎఫ్2’ కోసం కేటాయించాలని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video
Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus