‘జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. టైమింగ్ లో గ్యాప్ ఉండదు..’ బ్రూస్లీ లో మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ మాత్రమే చెప్పారు. ఇప్పుడది చేసి చూపించారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ఖైదీ నంబర్ 150 ప్రారంభానికి కాస్త ఆలస్యం అయింది కానీ.. రిలీజ్ విషయంలో ఒక్క రోజు కూడా లేటు కాకుండా ఉండాలని శ్రమించారు. సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించడమే కాదు పక్కా ప్లాన్ తో పూర్తి చేశారు. మాస్ డైరక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 నేడు (గురువారం) సెన్సార్ బోర్డు సభ్యుల ముందుకు వెళ్ళింది.
ఎటువంటి కట్స్ లేకుండా యూఏ సర్టిఫికెట్ అందుకుని పెద్ద పండగకు సిద్ధమైంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత రామ్ చరణ్ తేజ్ అన్ని ఏర్పాట్లు చేశారు. సెన్సార్ కంప్లీట్ కావడంతో ఇక చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలతో పాటు, జనవరి 4 న నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పనుల్లో నిమగ్నం కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.