టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగే క్రమంలో అనుకోకుండా సొంత పార్టీ పెట్టి ఇక్కట్లను కొని తెచ్చుకున్న మన మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ టాలీవుడ్ లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు. అయితే అదే క్రమంలో ఈ సినిమాపై అంచనాల లెక్కలు పక్కన పెడితే…ఈ సినిమా మార్కెట్ మాత్రం భారీ రేంజ్ లో జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమాని చెర్రీ భారీగా అమ్మే విధంగా పక్కా ప్లాన్ తో బ్యానర్ స్టార్ట్ చేశాడా అన్నట్లు సాగుతుంది ఈ సినిమా బిజినెస్…కేవలం ఒక్క సీమాంధ్ర ప్రదేశ్ లోనే ఈసినిమాకు సంబంధించి 35 కోట్ల బిజినెస్ డీల్ పూర్తి అయినట్లు వార్తలు వస్తున్నాయి.
సంక్రాంతికి బడా సినిమాలు చాలా ఉన్నప్పటికీ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన హక్కులను ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ 8.1 కోట్లకు కొనుక్కోవడం షాకింగ్ గా మారడమే కాకుండా ఇది ‘బాహుబలి 2’ బిజినెస్ ను మించి పోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ఒక డిస్ట్రిబ్యూటర్ 4.5 కోట్లకు పశ్చమ గోదావరి జిల్లా రైట్స్ ను కొనుక్కోవడం మరింత షాక్ ఇస్తోంది అంటూ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే అదంతా పక్కన పెడితే….చిరు రీ ఎంట్రీ…ఆయన పై ఉన్న క్రేజ్….ఇంకా చెప్పాలి అంటే అభిమానులు చేస్తున్న కోలాహాలం మధ్య భారీగా కొన్నారు మన బయ్యర్స్….వారు పెట్టిన పెట్టుబడులకు లాభాలు రావాలి అంటే ఎంత కాకపోయినా ఈ సినిమా కనీసం అంటే…కనీసం 100కోట్లు వసూళ్లు సాధించాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరు 100కోట్లు వసూళ్లు అంటే కష్టమే…ఏమాత్రం తేడా వచ్చినా కొన్నవారికి కష్టాలు తప్పవు….చూడాలి మరి ఏం జరుగుతుందో.