హిందీ జనాలు తెలుగు సినిమాల పై మోజు పెంచుకున్నారనేది నిజం.మన ప్లాప్ సినిమాలను కూడా అక్కడి యూట్యూబ్లో డబ్ చేస్తే 100 మిలియన్లకు పైనే వ్యూస్ నమోదవుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అయితే ఇది కేవలం యూట్యూబ్ వరకే పరిమితం అయ్యిందా అంటే కాదు. ఈ విషయాన్ని ప్రూవ్ చేసింది. ఈ సినిమా అక్కడ రూ.60 కోట్ల వరకు నెట్ కలెక్షన్లను రాబట్టింది. ఈ లెక్క రూ.100 కోట్లుగా ప్రచారం చేసారు కానీ.. ఆరా తీస్తే అంతే కలెక్ట్ చేసిందని ఇన్సైడ్ టాక్.
సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే… ‘పుష్ప’ లానే ఇప్పుడు మరిన్ని తెలుగు సినిమాలో హిందీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యాయి.ఇటీవల ‘ఖిలాడి’ కూడా హిందీలో రిలీజ్ అయ్యింది. రవితేజ సినిమాలకి హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ కింద రూ.20 కోట్లకి పైనే కలెక్ట్ చేస్తుంటాయి. దీంతో ‘ఖిలాడి’ చిత్రాన్ని చాలా కాన్ఫిడెంట్ గా రిలీజ్ చేశారు నిర్మాతలు. ‘పెన్ స్టూడియోస్’ వారే ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేయడం జరిగింది.
బ్రేక్ ఈవెన్ కు అక్కడ రూ.3.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది ‘ఖిలాడి’ చిత్రం. ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. రూ.1.5 కోట్ల వరకు నెట్ కలెక్షన్లను రాబట్టింది ఈ మూవీ. అయితే షేర్ పరంగా చూసుకుంటే అది కేవలం రూ.0.62 కోట్లుగా మాత్రమే ఉందట. వీకెండ్ తర్వాత ‘ఖిలాడి’ హిందీలో డ్రాప్ అయిపోయింది. నిజానికి ‘ఖిలాడి’ అక్కడ బాగానే కలెక్ట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ‘ఖిలాడి’ కి హిందీలో ఎటువంటి ప్రమోషన్లు నిర్వహించలేదు.
కనీసం ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్టు కూడా అక్కడి జనాలకి తెలీదు. అయినా ఈ మాత్రం కలెక్ట్ చేసింది అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఒకవేళ హిందీలో కూడా ప్రమోట్ చేసి ఉంటే… మంచి కలెక్షన్లు నమోదయ్యేవి.