మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖిలాడి’. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని.. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ‘పెన్ స్టూడియోస్’, ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ల పై కోనేరు సత్య నారాయణ నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ఫిబ్రవరి 11న విడుదలై మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది.
మొదటివారం కలెక్షన్లు బాగానే వచ్చాయి.8 వ రోజున కూడా ఓ మాదిరిగా పర్వాలేదు అనిపించింది.ఒకసారి 8 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
3.80 cr
సీడెడ్
1.70 cr
ఉత్తరాంధ్ర
1.47 cr
ఈస్ట్
0.76 cr
వెస్ట్
0.62cr
గుంటూరు
1.03 cr
కృష్ణా
0.58 cr
నెల్లూరు
0.51 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
10.47 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
1.94 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
12.41 cr
‘ఖిలాడి’ చిత్రానికి రూ.22.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.12.41 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.10.59 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 వ రోజున కూడా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.0.25 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.
అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా పెద్దది కాబట్టి.. రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంటే తప్ప వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.