‘కింగ్డమ్’ సినిమా మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ కెరీర్లో చాలా కీలకమైన సినిమా ఇది. అతని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. కొన్నాళ్లుగా అతను ప్లాపుల్లో ఉన్నాడు.ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ఆల్రెడీ యూ.ఎస్.కాపీలు వెళ్లిపోయాయి.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాపీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకి పలు సెన్సార్ కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ సెన్సార్ కట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) 29 నిమిషాల 50 సెకన్ల వద్ద వచ్చే ‘భగత’ ట్రైబ్ అనే పదాన్ని డిలీట్ చేశారట.
2) 13 నిమిషాల 30 సెకన్లు వద్ద ‘ముసలి ముండా కొడకా’ అనే డైలాగ్ ఉంటుందట. దాన్ని కూడా తొలగించినట్టు తెలుస్తుంది.
3)6 నిమిషాల వద్ద వచ్చే డెడ్ బాడీస్(శవాల) విజువల్స్ ను సీజీతో కవర్ చేశారట.
4)26:40 నిమిషాలు, 1 గంట 47 , 1 : 47: 10 , 2: 08: 50, 2:12:08,2 :27:00 నిమిషాల వద్ద విపరీతమైన రక్తపాతం కలిగిన సన్నివేశాలను సిజితో కవర్ చేశారట.
5)2: 07:24 గంటల , 2: 12: 00 గంటల వద్ద వచ్చే వయొలెన్స్ తో కూడుకున్న సన్నివేశాలను కూడా సీజీతో కవర్ చేశారట.
6) అలాగే స్మోకింగ్ ఎపిసోడ్స్, ఆల్కహాల్ ఎపిసోడ్స్ వద్ద కూడా అలర్ట్ మెసేజ్ కూడా వేసినట్టు సమాచారం.
అలా మొత్తంగా 2 నిమిషాల 31 సెకన్ల నిడివి కలిగిన ఫుటేజీని డిలీట్ చేసినట్లు సమాచారం.