అబ్బో.. కిరణ్ అబ్బవరం ప్లానింగ్ మామూలుగా లేదు.. ఆ రెండు కొడితే చాలు..!

2019లో వచ్చిన ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రంలో అమాయకత్వంతో కూడిన నటనతో అతను మంచి మార్కులు వేయించుకున్నాడు.అటు తర్వాత 2021 లో వచ్చిన ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుని కిరణ్ అబ్బవరం రేంజ్ ను అమాంతం పెంచేసింది. ఆ టైంలో సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించారు.

సెకండ్ లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుని వరుస సినిమాలు రిలీజ్ అవ్వడానికి సాయపడింది. 2022లో ‘సెబాస్టియన్ పిసి 524’ అనే ప్రయోగాత్మక చిత్రంలో నటించాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఆడలేదు కానీ అతన్ని నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించింది. ఆ తరువాత సమ్మర్ లో రిలీజ్ అయిన ‘సమ్మతమే’ పర్వాలేదు అనిపించింది. సెప్టెంబర్ 16న విడుదలైన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ డిజాస్టర్‌గా మిగిలింది.

అంతేకాదు ఇతన్ని నెటిజన్లు భారీగా ట్రోల్ చేయడానికి కూడా ఈ మూవీ కారణమైంది. సో ఆరంభ దశలో కిరణ్ ఒక్కో స్టెప్ పైకి ఎక్కుతూ వచ్చాడు. ప్రస్తుతం కిరణ్ చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవల కిరణ్ ఒక ప్రముఖ కార్పొరేట్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యాడు మరియు కొన్ని ప్రసిద్ధ బ్రాండ్‌లు అతనిని సంప్రదించాయి. వారిలో కొంతమందితో చర్చలు కూడా జరిపాడు కిరణ్.షార్ట్ ఫిల్మ్స్ నుంచి మొదలైన ఇతని కెరీర్ ఇప్పుడు పెద్ద బ్రాండ్స్ ను ప్రమోట్ చేసే రేంజ్ కు వెళ్ళింది

అంటే అది నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. అలాగే మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, ఏ ఎమ్ రత్నం & ఏషియన్ సినిమాస్ వంటి బడా బ్యానర్‌లలో అతను సినిమాలు చేయబోతున్నాడు. ఇందులో ఒకటి రెండు హిట్ అయినా అతనికి స్టార్ స్టేటస్ దక్కుతుంది. 2023 సంత్సరంలో ఫుల్ బిజీగా వరుస ప్రోజెక్ట్స్ ను లైన్ లో పెట్టాడు

ఈ యంగ్ హీరో.ఫిబ్రవరి 17, 2023 న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రం మహాశివరాత్రి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఆ వెంటనే ఇంకో రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి. కిరణ్ అబ్బవరం కెరీర్ ప్లానింగ్స్ బాగానే ఉన్నాయి. 2023 కిరణ్ కూడా చాలా కీలకంగా మారింది అనే చెప్పాలి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus