లెక్కలు తెలియకుండా మాట్లాడకండి.. ట్రోలర్స్ పై మండిపడ్డ కిరణ్ అబ్బవరం !

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన ఇతను ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా మారాడు. ఆ సినిమాకి మంచి టాక్ వచ్చింది. అటు తర్వాత ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ అనే సినిమా చేశాడు. అది కమర్షియల్ సక్సెస్ అందుకుంది. అయితే ఆ తర్వాత చేసిన ‘సెబాస్టియన్’ ‘సమ్మతమే’ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ వంటి చిత్రాల పై నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.

‘సమ్మతమే’ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించినా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే తాజాగా వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం ట్రోలర్స్ పై విరుచుకుపడ్డాడు. అతను మాట్లాడుతూ… ‘నా పై సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. నా సినిమా రిలీజ్ అవుతుంది అంటే..

చాలా మంది ఎన్నో నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ‘సమ్మతమే’ సినిమా ప్లాప్ అని కొంతమంది కామెంట్లు చేశారు. ఆ సినిమాకి రూ.3 కోట్లు పెట్టాం. ఫైనల్ గా అది రూ.12 కోట్లు కలెక్ట్ చేసింది. అయినా ఆ సినిమా డిజాస్టర్ అన్నారు. ఇలాంటి లెక్కలు ఏమీ తెలీకుండా వాగడం కరెక్ట్ కాదు.

ఇప్పుడు ఈ సినిమాకి 3 రోజుల్లోనే పెట్టిన డబ్బంతా వెనక్కి వచ్చేసింది’ అంటూ ఘాటుగా స్పందించాడు కిరణ్ అబ్బవరం. ఇప్పటి రోజుల్లో ఓ సినిమా సక్సెస్ అనేది బాక్సాఫీస్ వద్ద వచ్చే కలెక్షన్స్ ను బట్టే డిసైడ్ అవుతుంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus