ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన సినిమా బాహుబలి. అయితే ఆ సినిమా మొదటి భాగం సూపర్ హిట్ గా నిలవడంతో రెండో భాగంపై ఫోకస్ పెట్టాడు మన రాజమౌళి. ఆ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు దర్శకుడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మ్యాటర్ లేదు అని…అంతా మాయె అంటున్నాడు సీనియర్ దర్శకుడు, నటుడు అయినటువంటి “కోడి రామకృష్ణ”. ఇంతకీ ఎప్పుడు వివాదల్లోకి రాణి రామ్ కృష్ణ ఇలా ఎందుకు అన్నారు…అసలు ఏమయింది అంటే…..
ఆయన వర్షన్ ప్రకారం….బాహుబలి లో కథ లేదని కేవలం గ్రాఫిక్స్ మాత్రమే ఉన్నాయని కథ కు సాంకేతిక అంశాలు తోడవ్వాలి కానీ సాంకేతిక అంశాలకు కథ ఎప్పుడూ తోడవ్వ కూడదని బాహుబలి రెండో కోవకు చెందుతుంది అని తెలిపారు…అంతేకాదు ఇవన్నీ విని ఆయనే ఏదో రాజమౌలిని విమర్శిస్తున్నారు అని అనుకోకండి, ఆయన జక్కన్న టాలెంట్ ని పోగుడుతూనే…బాహబలి కంటే ‘ఈగ’ లాంటి చిత్రం ఎంతో బాగుందని అలాంటి చిత్రం తీసినందుకు రాజమౌళి కి పద్మశ్రీ ఇచ్చి ఉంటే గౌరవంగా ఉండేది అని తెలిపారు….
అసలైతే….గ్రాఫిక్స్ తెలుగులో ప్రాణం పోసిన దర్శకులు కోడి రామకృష్ణ అని చెప్పాలి. అమ్మోరు, దేవి, అంజి లాంటి చిత్రాల్లో అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలం చేశారు. మరి దేనీపై జక్కన్న ఏమైనా స్పందిస్తాడో…లేకపోతే లైట్ తీసుకుంటాడో చూడాలి.