‘ఆచార్య’ సినిమా మొదలైనప్పటి నుండి ఒక టాక్ కంటిన్యూగా వినిపిస్తూ వచ్చింది. అదే ఆ సినిమాలో చిరంజీవితోపాటు ఓ యంగ్ హీరోకు ప్లేస్ ఉంది అని. ఆ పాత్ర కోసం చాలామంది పేర్లు వినిపించాయి. ఒక దశలో మహేష్‌బాబు ఆ పాత్ర చేస్తాడని కూడా పుకారుజనులు అన్నారు. అయితే ఆయన నటించేంత స్కోప్ ఉన్న పాత్ర కాదని వినిపించింది. అయితే మెగా కుటుంబంలో అంతమంది ఉండగా, ఇంకో హీరో ఎందుకు అని కూడా అన్నారు. అయితే చాలామంది అనుకున్నట్లే రామ్‌చరణ్ ఆ పాత్రలోకి వచ్చాడు. అయితే ఆ పాత్ర కోసమే సినిమా చూద్దాం అనుకునేవాళ్లు మాత్రం సెకండాఫ్ వరకు వెయిట్ చేయాల్సిందేనట.
‘ఆచార్య’లో చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా కనిపిస్తారని గతంలోనే వార్తలొచ్చాయి. దేవాదాయ శాఖలో జరుగుతున్న అక్రమాలపై పోరాడే వ్యక్తిగా కనిపిస్తాడు. అయితే పూర్వాశ్రమంలో విప్లవ దారిలో ఉంటాడని సమాచారం. ఇప్పటికే విడుదల చేసిన కొన్ని పోస్టర్లలో ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. అయితే ఆ సమయంలోనే రామ్‌చరణ్ పాత్ర సినిమాలోకి ఎంటర్ అవుతుందట. అంటే చిరు విప్లవ లుక్ సెకండాఫ్‌లోనే వస్తుందన్నమాట. అంటే చరణ్ ఫ్యాన్స్ సెకండాఫ్‌లోనే ఖుష్ అవుతారు. అయినా చిరంజీవి ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ అంటూ రెండు వర్గాలుంటాయా ఏంటి?
ఈ లెక్కన మాట్లాడుకుంటే.. ‘ఆచార్య’ ఫస్టాఫ్ వరకు సింగిల్ ఫీస్ట్ అయితే, సెకండాఫ్ వచ్చేసరికి డబుల్ ఫీస్ట్ అన్నమాట. చిరు, చరణ్‌ను ఒకే ఫ్రేమ్‌లో ఎక్కువసేపు చూద్దాం అనుకునేవారికి ‘ఆచార్య’ సెకండాఫ్ ఫీస్టే మరి. అన్నట్లు సెకండాఫ్‌లోనే వచ్చే చరణ్, పూజ హెగ్డే డ్యూయట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. ఈ పాట చిత్రీకరణ ఇప్పటికే పూర్తవ్వాలి. అయితే ఆ ఇద్దరికీ వరుసగా కరోనా రావడం, లాక్‌డౌన్ పెట్టడం కారణంగా ఆ పాట చిత్రీకరణ ఆగిపోయింది. తిరిగి చిత్రీకరణ ఈ పాటతోనే మొదలవుతుందని సమాచారం.