మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘డాన్ శీను’ ‘బలుపు’ వంటి హిట్ సినిమాల తర్వాత రూపొందిన చిత్రం ‘క్రాక్’. 2021 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైంది ఈ సినిమా. అది కోవిడ్ టైం. థియేటర్లకి ఆడియన్స్ వస్తారా? లేదా? అనే అయోమయంలో ఇండస్ట్రీ ఉన్న టైం. పైగా మొదటి రోజు ఆలస్యంగా షోలు పడ్డాయి.అయినప్పటికీ ‘క్రాక్’ పాజిటివ్ తెచ్చుకుని థియేటర్లకు ఆడియన్స్ ని మెప్పించింది. ఫుల్ రన్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Krack Collections:
నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తవుతున్న తరుణంలో ఒకసారి.. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
12.47 cr
సీడెడ్
6.24 cr
ఉత్తరాంధ్ర
4.79 cr
ఈస్ట్
3.29 cr
వెస్ట్
2.34 cr
కృష్ణా
2.38cr
గుంటూరు
2.81 cr
నెల్లూరు
1.79 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
36.11 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.77 cr
తమిళ్+మలయాళం
0.38 cr
ఓవర్సీస్
0.90 cr
టోటల్ వరల్డ్ వైడ్
39.16 cr
0
0
0
0
‘క్రాక్’ చిత్రం రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 39.16 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 50 శాతం ఆక్యుపెన్సీతో కూడా ఈ సినిమా ఇంత మొత్తం కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మొత్తంగా బయ్యర్స్ కి రూ.21 కోట్ల వరకు లాభాలు అందించడమే కాకుండా.. దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో రవితేజ..లకి హ్యాట్రిక్ సక్సెస్ ను కూడా కట్టబెట్టింది.