కృష్ణ వ్రింద విహారి మూవీ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్

నాగ శౌర్య అప్ కమింగ్ మూవీ కృష్ణ వ్రింద విహారి చిత్రం ఏప్రిల్ 22 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలోదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలయ్యి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.ఇక ఏ మాత్రం డిలే చేయకుండా ప్రమోషన్లను కూడా మొదలుపెట్టేసింది చిత్ర బృందం.

టీజర్ తో హీరో హీరోయిన్ల పెయిర్ బాగుందనే ప్రశంసలు దక్కాయి.వీరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండిందని స్పష్టమవుతుంది.ఇదిలా ఉండగా ఈ చిత్రంలోని వర్షంలోని వెన్నెల అనే పాటని ఏప్రిల్ 9 న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది.హీరో నాగ శౌర్య మరియు హీరోయిన్ షర్లీ సెటియా పై రూపొందిన రొమాంటిక్ మెలోడీగా ఈ పాట రూపొందింది.దానికి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా వదిలారు.

ఈ పోస్టర్ లో షర్లీ… శౌర్యను వెనుక కౌగిలించుకుంది.ఈ పోస్టర్ యూత్ ను ఇట్టే ఆకర్షించేలా ఉంది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో రూపొందిన ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ కాగా తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరించారు.ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Share.