ఒకప్పటి స్టార్ హీరోల గురించి చెప్పుకోవాలి అంటే.. ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్ బాబు , కృష్ణంరాజు పేర్లు చెప్పుకునే వారు. వీళ్లలో కృష్ణ, కృష్ణంరాజు ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్,ఏ.ఎన్.ఆర్ ల డామినేషన్ ఉన్నప్పుడు మంచి కథలు మొత్తం వాళ్ళ వద్దకే వెళ్ళేవి. నిర్మాతలు కూడా వాళ్ళతోనే సినిమాలు చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. మాస్ కథలు కూడా వాళ్ళ వద్దకే వెళ్ళేవి. ఈ నేపథ్యంలో కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరూ కూడా సొంత నిర్మాణ సంస్థలు ఏర్పరుచుకుని మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టే కథలు క్యాచ్ చేయడం మొదలుపెట్టారు. ఇద్దరూ కూడా తమ సోదరులను మెయిన్ నిర్మాతలుగా పెట్టుకున్నారు. తమ సొంత బ్యానర్ల పై పలు సూపర్ హిట్ సినిమాలను కూడా నిర్మించుకున్నారు.
ప్రస్తుతం కృష్ణంరాజు గారి గురించి చెప్పుకుందాం. ఇటీవల ఆయన కాలం చేశారు. నటుడుగానే కాకుండా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఆయన పలు సినిమాలు నిర్మించారు. ఆ సినిమాలు ఏంటో వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి:
1) కృష్ణ వేణి :
కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని వి.మధుసూదన రావు డైరెక్ట్ చేశాడు. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు తో కలిసి కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
2) భక్త కన్నప్ప :
కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ మూవీని బాపు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూర్య నారాయణ రాజు, కృష్ణంరాజు నిర్మాణంలో రూపొందే సినిమాల పై జనాల్లో నమ్మకం కూడా ఏర్పడింది. ఇదే చిత్రాన్ని ప్రభాస్ తో రీమేక్ చేయాలి అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు
3) అమరద్వీపం :
కృష్ణంరాజు, జయసుధ నటించిన ఈ చిత్రానికి కే.రాఘవేంద్ర రావు గారు దర్శకుడు. తీక్కనల్ అనే మలయాళం చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో కూడా ఈ మూవీ పర్వాలేదు అనిపించింది.
4) మనవూరి పాండవులు:
ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించారు కృష్ణంరాజు,సూర్య నారాయణ రాజు. జయకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించింది. ఈ చిత్రంలో చిరంజీవికి కూడా నటించే అవకాశం కల్పించారు కృష్ణంరాజు.
5) సీతా రాములు :
కృష్ణంరాజు, జయప్రద జంటగా నటించిన ఈ మూవీని దాసరి నారాయణరావు డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ కూడా పర్వాలేదు అనిపించింది.
6) మధుర స్వప్నం :
కృష్ణంరాజు హీరోగా జయసుధ, జయప్రద హీరోయిన్లుగా కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా పర్వాలేదు అనిపించింది.
7) బొబ్బిలి బ్రహ్మన్న:
కృష్ణంరాజు డబుల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీని కే.రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కృష్ణంరాజు ట్రేడ్ మార్క్ డైలగ్ అయిన ‘ జానకి కత్తందుకో జానకి ‘ డైలాగ్ ఈ సినిమాలోదే..!
8) తాండ్ర పాపారాయుడు:
ఈ మూవీ కూడా కృష్ణంరాజు సొంత నిర్మాణంలో రూపొందినదే. దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
9) బిల్లా :
ప్రభాస్ హీరోగా కృష్ణంరాజు కీలక పాత్రలో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎబౌవ్ యావరేజ్ గా నిలిచింది.
10) రాధే శ్యామ్ :
ప్రభాస్,పూజా హెగ్డే జంటగా నటించిన ఈ మూవీని రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేయగా యూవీ క్రియేషన్స్ తో కలిసి కృష్ణంరాజు, ప్రసీద నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది.