శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ధనుష్ (Dhanush) హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేసి 3 ఏళ్ళు అయ్యింది. ‘లవ్ స్టోరీ’ (Love Story) నిర్మాతలతోనే శేఖర్ కమ్ముల ఇంకో సినిమాకు కమిట్ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ ప్రాజెక్టు ఉండబోతుంది అని అనౌన్స్ చేశారు. అయితే స్క్రిప్ట్ విషయంలో శేఖర్ కమ్ముల కాన్ఫిడెంట్ గా లేకపోవడం వల్ల కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. అదే టైంలో ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది.
Kubera
మరోపక్క దీని తర్వాత ప్రారంభమైన ‘సార్’ (Sir)కూడా స్టార్ట్ అయ్యి.. రిలీజ్ అయిపోవడం వల్ల.. ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. అయితే అందులో నిజం లేదు అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఈ ప్రాజెక్టులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఓ ముఖ్య పాత్ర కోసం నాగార్జునని (Nagarjuna) తీసుకున్నారు. తర్వాత పాన్ ఇండియా కలర్ దిద్దారు. అంటే తెలుగు, తమిళ్..తో పాటు ఈ సినిమా మిగిలిన భాషల్లో కూడా రిలీజ్ అవుతుందన్న మాట.
‘కుబేర’ (Kubera) పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన తర్వాత దీని బడ్జెట్ లెక్కలు కూడా పెరిగాయి. రెండేళ్లు సినిమా ఆలస్యం అవ్వడం వల్ల… ఇంట్రెస్ట్ రేట్లు ఎలాగూ పెరిగిపోయాయి. ఒక్క ధనుష్ కే రూ.50 కోట్లు పారితోషికం ఇస్తున్నారు. నాగార్జునకి రూ.12 కోట్లు ఫిక్స్ చేశారని వినికిడి. ఇక దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) , రష్మిక (Rashmika Mandanna) వంటి స్టార్స్ ఈ సినిమా చాలా మంది ఉన్నారు.
మొత్తంగా పారితోషికాల రూపంలోనే ఈ సినిమాకు రూ.80 కోట్లు బడ్జెట్ అయినట్లు తెలుస్తుంది. ఇక మేకింగ్ కాస్ట్ మొత్తంగా రూ.60 కోట్లు వరకు అయ్యిందని టాక్. అంటే ‘కుబేర’ (Kubera) బడ్జెట్ లెక్క రూ.140 కోట్లు టచ్ అయ్యిందన్న మాట. రిలీజ్ టైంకి అది రూ.150 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు అని వినికిడి.