Vettaiyan First Single: ‘వేట్టయన్’ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
- September 9, 2024 / 09:13 PM ISTByFilmy Focus
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ‘జైలర్’ (Jailer) తో సాలిడ్ హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చారు. అయితే ఆ తర్వాత తన కూతురిపై ప్రేమ కొద్దీ చేసిన ‘లాల్ సలాం’ డిజాస్టర్ అయ్యింది. దాన్ని రజనీ ఖాతాలో అయితే వేయలేం కాబట్టి.. ఇప్పుడు ఆయన ఫామ్లో ఉన్నట్టే..! అందుకే త్వరలో రాబోతున్న ‘వేట్టయన్’- ది హంటర్ (Vettaiyan) సినిమాకి మంచి బజ్ ఉంది. ‘జై భీమ్’ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) ఈ చిత్రానికి దర్శకుడు.
Vettaiyan First Single

అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) , రానా దగ్గుబాటి (Rana) వంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. మరో టాలీవుడ్ నటుడు రావు రమేష్ (Rao Ramesh) కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి తెలుగు ప్రేక్షకులకి ‘ఇది డబ్బింగ్ సినిమా’ అనే ఆలోచన రాకపోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. ఈరోజు ‘వేట్టయన్’ (Vettaiyan) నుండి మొదటి పాటగా ‘మనసిలాయో’ అనే లిరికల్ సాంగ్ బయటకు వచ్చింది.

‘మెరుపై వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. మడతపెట్ట వచ్చిండే’ అంటూ తమిళ వాసనతో కూడిన లిరిక్స్ తో ఈ పాట మొదలైంది. అయితే బీట్ మాత్రం అనిరుధ్ – రజనీ..ల రేంజ్లో ఉన్నాయి. లిరికల్ సాంగ్ మధ్యలో రజినీకాంత్ డాన్స్ మూమెంట్స్ కూడా అలరించే విధంగా ఉన్నాయి. చూస్తుంటే.. సినిమాలో ఇది ఒక ఫ్యామిలీ సాంగ్..లా వచ్చేలా కనిపిస్తుంది. కానీ మాస్ బీట్ మాత్రం అందరితో చిందులు వేయించే విధంగా ఉంది. మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి :














