కొత్త కెప్టెన్ కోసం బిగ్‌బాస్ బురదలో కాసుల వేట అనే టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో బురద పోసి, అందులో కాయిన్స్ వేశాడు. వాటిని ఏరి బుట్టలో వేయాలని హౌస్ మేట్స్‌కు చెప్పాడు. కెప్టెన్సీ పోటీలో ఉన్న అమ్మ రాజశేఖర్, హారిక, కుమార్‌సాయి, సుజాత బురదలోకి దిగారు. తొలుత నెమ్మదిగా మొదలైన కాయిన్స్ ఏరివేత.. తర్వాత ఊపందుకుంది.
అమ్మ రాజశేఖర్ మాస్టర్ అయితే బురదలో దొర్లి దొర్లి మరీ కాయిన్స్ వెతికాడు. అయితే తృటిలో రెండో స్థానానికి పరిమితమైపోయాడు. సుజాత మూడో స్థానంలో నిలవగా, హారిక నాలుగో స్థానంలో నిలిచింది. విజేతగా నిలిచన కుమార్ సాయి 3,500 పాయింట్లు రాగా, మాస్టర్ 3,200 వచ్చాయి. ఇక స్విచ్ కాయిన్‌తో అనూహ్యంగా పోటీలోకి వచ్చిన సుజాత 2,900 పాయింట్లు మాత్రమే సంపాదించగలిగింది. హారిక 2,000 పాయింట్లు సాధించింది.
దీంతో బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్‌గా కుమార్‌సాయిని ప్రకటించాడు. కొత్తగా కెప్టెన్ హ్యాండ్ బ్యాండ్‌ను కూడా ఇచ్చాడు. దీంతో తదుపరి నామినేషన్ నుంచి కుమార్ సాయి సేఫ్ అయ్యాడు. ఇన్నాళ్లూ ఇంట్లో ఉండటానికి పనికి రాడు అంటూ అందరూ అన్న కుమార్ సాయి… ఇదిగో ఇలా కెప్టెన్ అయ్యాడు. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు అని అంటారు.