Mega Heros: మెగా హీరోలపై అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్.. ఏం జరిగిందంటే?
- September 5, 2024 / 05:06 PM ISTByFilmy Focus
మెగా హీరోలకు (Mega Heros) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి (Chiranjeevi) , పవన్ (Pawan Kalyan) , చరణ్ (Ram Charan) లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో సైతం ఈ హీరోలకు అభిమానులు ఉన్నారు. రెమ్యునరేషన్ పరంగా కూడా ఈ స్టార్ హీరోలు టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ హీరోలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏకంగా 8 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు.
Mega Heros

పవన్ కళ్యాణ్ ఏకంగా 6 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. అయితే మెగా హీరోలపై ఒక అభిమాని వినూత్నంగా అభిమానాన్ని చాటుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ఒక అభిమాని మెగా హీరోల (Mega Heros) త్రీడీ పెయింటింగ్ వేశారు. చిరంజీవి, పవన్, చరణ్ ఫోటోలతో కుప్పంకు చెందిన పురుషోత్తం అనే అభిమాని వేసిన పెయింటింగ్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకే పెయింటింగ్ లో ముగ్గురు మెగా హీరోలను చూసిన ఫ్యాన్స్ ఈ అభిమాని అభిమానానికి ఫిదా అవుతున్నారు. మెగా హీరోలు తమ ప్రతిభతో ఇంతలా అభిమానించే ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మెగా హీరోలు (Mega Heros) ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. మెగా హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతుండటం గమనార్హం. మెగా హీరోల పారితోషికాలు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి. మెగా హీరోలకు క్రేజ్ సైతం పెరుగుతోంది. చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా , పవన్ ఓజీ (OG Movie) సినిమా, చిరంజీవి విశ్వంభర (Vishwambhara) సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
















