Kushi Movie: సమంతనే కారణమంటూ వార్తలు.. ‘లైగర్’ ఎఫెక్ట్ కాదా?

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా స్టార్ హీరోల రిలీజ్ డేట్స్ విషయంలో క్లాష్ అనేది కామన్.. ఫెస్టివల్ సీజన్‌లో బాక్సాఫీస్ బరిలో వార్ తప్పదు.. మన తెలుగు ఆడియన్స్ అలాంటప్పుడు 3, 4 సినిమాలొచ్చినా ఆదరిస్తారు.. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఓ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న చిత్రాల మధ్య విడుదల తేదీల విషయంలో గందరగోళం అనేది టాలీవుడ్‌లో బహుశా ఇదే తొలిసారేమో.. డిస్ట్రిబ్యూషన్ నుండి ప్రొడక్షన్‌లోకి వచ్చి.. సాలిడ్ సినిమాలు చేసి, స్టార్లందరికీ అడ్వాన్సులిచ్చి లైన్‌లో పెట్టారు మైత్రీ మూవీ మేకర్స్ వారు.. మొదట ముగ్గురుగా మొదలై, ఇప్పుడు నవీన్, రవిశంకర్ ఇద్దరే సినిమాలు చేస్తున్నారు..

చిరంజీవి, బాలయ్యలతో వాళ్లు చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ గురించి సంక్రాంతి వార్ ఎలా నడుస్తుందో తెలిసిందే.. సమస్యే లేదు పొంగల్ పోరుకి సిద్ధమని హీరోలంటే, థియేటర్లు లేవని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మొత్తుకుంటుంటే మధ్యలో వీళ్లు బుక్ అయిపోయారు.. కట్ చేస్తే మైత్రీ వారికిప్పుడు ముచ్చటగా మూడో తలనొప్పి స్టార్ట్ అయింది.. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండల క్రేజీ కాంబోలో.. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాలతో ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ వారు నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్..

‘ఖుషి’.. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాని మొదట డిసెంబర్ 23న రిలీజ్ చేద్దామనుకుని తర్వాత ఫిబ్రవరికి మార్చారు.. ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ చేయబోతున్నారనే వార్త బయటకి రావడంతో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.. సమంత హెల్త్ ఇష్యూస్ వల్ల షూటింగ్ లేట్ అవుతుందని.. ‘లైగర్’ తర్వాత పూరి కారణంగా విజయ్ సినిమా మీద బయ్యర్లు ఇంట్రెస్ట్ చూపించట్లేదని.. ఒకవేళ సమంత, మైత్రీ ట్రాక్ రికార్డ్‌ని బట్టి బిజినెస్ చెయ్యొచ్చని పుట్టగొడుగుల్లా వార్తలు పుట్టుకొస్తున్నాయి.. ఫిలిం వర్గాల వారి సమాచారం మేరకు అవన్నీ పుకార్లేనని..

‘ఖుషి’ మూవీని డిసెంబర్ నుండి ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేయడానికి మైత్రీ వారి రెండు పెద్ద సినిమాలతో పాటు ఇతర సంక్రాంతి సినిమాలు, థియేటర్ల సమస్యలే ప్రధాన కారణమని తెలుస్తోంది.. రెండు భారీ చిత్రాల విడుదలకు కొద్ది రోజులేే టైం ఉంది.. ఇంకా ప్రాపర్ ప్రమోషన్స్ అవీ స్టార్ట్ చేయలేదు.. కాబట్టి ‘ఖుషి’ గురించి ఆలోచించే తీరిక లేదు.. జనవరి నుండి ఈ హడావిడి మొదలైతే.. తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి.. కాబట్టి ఓ మంచి డేట్ చూసుకుని సమ్మర్‌లో రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.. ఎలాగో తన ప్రీవియస్ ఫిల్మ్ థియేటర్లలో రిలీజ్ కాలేదు కాబట్టి కాస్త ఆలస్యమైనా వెయిట్ చేస్తానని డైరెక్టర్ కూడా కోపరేట్ చేస్తున్నాడట..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus