టాలీవుడ్ యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ (Vishwak Sen) తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. కేవలం యాటిట్యూడ్‌తో కాదు, విభిన్నమైన కథలు, మాస్ అప్పీల్‌తో విశ్వక్‌కి ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎక్స్‌పెరిమెంటల్ రోల్స్ నుంచి మాస్ ఎంటర్‌టైనర్స్ వరకు, ప్రతి సినిమా తో విశ్వక్ తన రేంజ్‌ను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ఆయన నటించిన లైలా మూవీపై టాలీవుడ్ లో హైప్ క్రియేట్ అవుతోంది.
లైలా (Laila) సినిమాతో విశ్వక్ సేన్ కొత్తగా లేడీ గెటప్‌లో కనిపిస్తుండటమే సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, ‘అటక్ మటక్’ లిరికల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విశ్వక్ సేన్ లేడీ గెటప్, మాస్ డ్యాన్స్ స్టెప్పులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్.
ఈ హైప్ లైలా ప్రీ-రిలీజ్ బిజినెస్ లో కూడా స్పష్టమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.8.20 కోట్ల రేంజ్‌లో ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించింది. ఇది విశ్వక్ కెరీర్‌లో నాలుగో హయ్యెస్ట్ బిజినెస్. విశ్వక్ సేన్ క్రమంగా తన మార్కెట్‌ను పెంచుకుంటున్నట్లు ఈ ఫిగర్స్ చెబుతున్నాయి. రీసెంట్ 6 సినిమాలు కలిపి అతని టోటల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ 50 కోట్ల మార్క్‌ను దాటడం విశేషం.
విశ్వక్ సేన్ కెరీర్‌లో హయ్యెస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ సినిమాలు:
1. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) – రూ.10.30 కోట్లు
2. గామి (Gaami) – రూ.10.20 కోట్లు
3. మెకానిక్ రాకీ (Mechanic Rocky) – రూ.8.50 కోట్లు
4. లైలా మూవీ – రూ.8.20 కోట్లు
5. దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki) – రూ.7.50 కోట్లు
6. ఓరి దేవుడా (Ori Devuda) – రూ.5.50 కోట్లు