Lavanya Tripathi: ఆ విషయంలో లావణ్యను మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఏమైందంటే?

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మిస్టర్, అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ సినిమాలలో నటించగా ఈ రెండు సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చి షాకిచ్చాయి. రీల్ లైఫ్ లో ఈ జోడీ ప్రేక్షకులను మెప్పించలేకపోయినా రియల్ లైఫ్ లో మాత్రం పెళ్లి చేసుకుని అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. పెళ్లి తర్వాత లావణ్య చేసే ప్రతి పోస్ట్, ప్రతి కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. తాజాగా లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకోవడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ ఫోటోలను గమనిస్తే చీరపై లావణ్య వరుణ్ లావ్ అని రాయించడంతో పాటు ఇన్ఫినిటీ సింబల్ వేయించారు. మా ఇద్దరి మధ్య ప్రేమ అనంతమని లావణ్య చెప్పకనే చెప్పేశారు. లావణ్య చెప్పులపై కూడా వీఎల్ అనే లెటర్స్ ను ఇంగ్లీష్ లో ప్రింట్ చేయించడం గమనార్హం. వరుణ్ గురించి లావణ్య ప్రస్తావిస్తూ నా భర్త అత్యంత అద్భుతమైన వ్యక్తి అని నన్ను బాగా చూసుకునే వ్యక్తి అని పేర్కొన్నారు. నేను చెప్పడానికి చాలా ఉందని కానీ దానిని మా మధ్యే ఉంచుకుంటామని లావణ్య అన్నారు.

మేము కలలు కన్న విధంగా మా కుటుంబాలు, సన్నిహితులతో కలిసి మూడు రోజుల పెళ్లి చేసుకున్నామని లావణ్య త్రిపాఠి వెల్లడించారు. ఈ వేడుకను స్పెషల్ గా చేసినందుకు అక్కడికి వచ్చిన వాళ్లకు మాకు బెస్ట్ విషెస్ చెప్పిన వాళ్లందరికీ నేను కృతజ్ఞతలు చెప్పానని (Lavanya Tripathi) లావణ్య అన్నారు. లావణ్య చేసిన పోస్ట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది.

లావణ్య పెళ్లి తర్వాత కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది. లావణ్య సినిమాలలో నటిస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus