స్టార్ హీరో విజయ్ ఈ మధ్య కాలంలో తెలుగు నిర్మాతలతో పని చేస్తూ తెలుగులో మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. వారసుడు, లియో సినిమాలు తెలుగులో భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో హిట్ గా నిలిచిన ఈ సినిమా తాజాగా బుల్లితెరపై ప్రముఖ ఛానెల్స్ లో ఒకటైన జెమిని ఛానల్ లో ప్రసారమైంది. ఈ సినిమాకు కేవలం 3 టీఆర్పీ వచ్చింది. ఈ సినిమాతో పోలిస్తే ఈటీవీలో ప్రసారమైన మ్యాడ్ మూవీ మెరుగైన రేటింగ్ ను సొంతం చేసుకుంది.
మ్యాడ్ మూవీ 4.7 టీఆర్పీ వచ్చింది. లియో (LEO) సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ రావడం అంటే విజయ్ కు షాకేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. థియేటర్లలో హిట్ గా నిలిచిన లియో మూవీ బుల్లితెరపై మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. లియో మూవీ భవిష్యత్తులో అయినా బుల్లితెరపై మంచి రేటింగ్ సాధిస్తుందేమో చూడాలి. బుల్లితెరపై సంక్రాంతి విజేతగా మ్యాడ్ నిలవగా ఈ వారం భగవంత్ కేసరి ప్రసారం కానుంది., గత వారం ప్రసారమైన స్కంద ఎంత రేటింగ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
ప్రస్తుతం ఓటీటీల హవా పెరగడంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలు సైతం బుల్లితెరపై మంచి రేటింగ్ లను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. గతంతో పోలిస్తే శాటిలైట్ హక్కులకు సైతం డిమాండ్ తగ్గుతోంది. పెద్ద సినిమాలకు ఎలాంటి సమస్య లేకపోయినా చిన్న సినిమాలు, మిడిల్ రేంజ్ సినిమాలకు శాటిలైట్ విషయంలో కూడా సమస్యలు ఏర్పడుతున్నాయి.
హిట్ టాక్ రాకపోవడం వల్ల బుల్లితెరపై ప్రసారం కాని సినిమాల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. శాటిలైట్ బిజినెస్ జరగకపోవడం వల్ల కొన్ని సినిమాల నిర్మాతలు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని తెలుస్తోంది. తెలుగులో ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ పరిమితంగా ఉండటం, ఓటీటీల హవా పెరుగుతుండటం ఈ పరిస్థితికి కారణమవుతోంది.