పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా పూరి జగన్నాథ్ కు భారీ నష్టాలను తీసుకువచ్చినదని చెప్పాలి. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఓవైపు డిస్ట్రిబ్యూటర్లు తమ డబ్బు తమకు వెనక్కి చెల్లించాలని పూరి జగన్నాథ్ పై ఒత్తిడి తెస్తున్నారు.
ఇకపోతే పూరి జగన్నాథ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లను రాబట్టకపోవడంతో భారీ నష్టాలను ఎదుర్కొంది.అయితే ఈ సినిమా కలెక్షన్లను చూసిన జనగణమన నిర్మాతలు ఒక్కసారిగా కంగు తిన్నారు. ఈ సినిమా ఎఫెక్ట్ తో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏకంగా జనగణమన సినిమా నుంచి ప్రొడ్యూసర్లు తప్పుకున్నట్టు తెలుస్తుంది. పూరి జగన్నాథ్ జనగణమన సినిమాని పూరి కనక్ట్స్ బ్యానర్ తో పాటు మై హోమ్ గ్రూప్ జనగణమన నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుందని లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పూరి జగన్నాథ్ వెల్లడించారు.ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం పూరి జగన్నాథ్ ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇకపోతే జనగణమన సినిమా భారీ బడ్జెట్ చిత్రం కావడంతో లైగర్ సినిమా డిజాస్టర్ అవడం వల్ల జనగణమన విషయంలో నిర్మాతలు మరోసారి ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.
అయితే లైగర్ కలెక్షన్లను చూసిన నిర్మాతలు అనవసరమైన రిస్క్ చేయడం ఎందుకని భావించి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇలా పూరి జగన్నాథ్ కి ఒకవైపు లైగర్ డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి తేవడం మరోవైపు జనగణమన నిర్మాతలు కూడా తప్పుకోవడంతో ఈయన అధిక ఒత్తిడికి గురవుతున్నారని అయితే నిర్మాతలు తప్పుకోవడంతో మరో నిర్మాతలు ఈ సినిమాకి కమిట్ అయ్యే వరకు షూటింగ్ కూడా వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా నిర్మాతలు వస్తేనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని లేకపోతే ఆయన డ్రీం ప్రాజెక్ట్ డ్రీమ్ గానే ఉండబోతుందని వార్తలు వినపడుతున్నాయి.