విజయ్ దేవరకొండ సినీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా విడుదలైన లైగర్ ఆ అంచనాలను అందుకోలేక ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా హక్కుల కోసం 85 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలుస్తోంది. ఈ మొత్తంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లైగర్ అన్ని భాషల హక్కులను కొనుగోలు చేసిందని బోగట్టా.
భారీ మొత్తంలో ఖర్చు చేసి హక్కులను కొనుగోలు చేసిన ఈ ఓటీటీ కొత్త నిబంధనల ప్రకారం 50 రోజుల తర్వాతే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం అందుతోంది. ఆలస్యంగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడం, సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు ఈ సినిమా వల్ల భారీ మొత్తంలో నష్టాలు తప్పవని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
మరోవైపు ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ కొనుగోలు చేసింది. తొలిరోజు లైగర్ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించగా రెండో రోజు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఫస్ట్ వీకెండ్ తర్వాత లైగర్ సినిమాకు కష్టమేనని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కార్తికేయ2 సినిమా మాత్రమే ఆప్షన్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.
కార్తికేయ2 సినిమా ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా కలెక్షన్లను సాధిస్తోంది. హీరో నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. కార్తికేయ2 మూవీ సక్సెస్ తో కార్తికేయ3 దిశగా అడుగులు పడుతున్నాయి. కార్తికేయ2 విజయాన్ని సాధించడంతో నిఖిల్ తర్వాత సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.