డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరికెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది.ఇక ఈ సినిమా ఊహించని స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక బాక్సాఫీస్ వద్ద డబుల్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమా కనుక ఊహించిన విధంగా హిట్ అయి ఉంటే పూరి జగన్నాథ్ దశ తిరిగిపోయేదని చెప్పాలి.
ఈ విధంగా పూరి జగన్నాథ్ ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలై బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను తీసుకువచ్చిందని చెప్పాలి. ఇక ఈ సినిమాతో నష్టాలను ఎదుర్కొన్న డిస్ట్రిబ్యూటర్లు తమ డబ్బును తిరిగి చెల్లించాలని పూరి జగన్నాథ్ పై అధిక ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరి జగన్నాథ్ సంపాదించినది మొత్తం సినిమాకు పెట్టుబడిగా పెట్టి నష్టపోయారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కంటెంట్ లేకపోయినప్పటికీ భారీ ప్రమోషన్లను నిర్వహించి పెద్ద ఎత్తున బిజినెస్ జరుపుకున్నారు.
తీరా సినిమా విడుదలైన తర్వాత సినిమా డిజాస్టర్ గా మిగిలిపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా భారీ నష్టాలను తీసుకురావడంతో పూరి జగన్నాథ్ ముంబై కాళీ చేయనున్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్ ఈ సినిమా పని నిమిత్తం ముంబైలో సి ఫేసింగ్ 4 బిహెచ్ కే ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. ఫ్లాట్ కోసం పూరి జగన్నాథ్ నెలకు 10 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తున్నారని ఇతరత ఖర్చులు కలుపుకుంటే సుమారు 15 లక్షల వరకు ఖర్చు వస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న నష్టాలలో నెలకి 15 లక్షలు ఖర్చుచేసి ముంబైలో నివసించడం అసాధ్యమవుతున్న నేపథ్యంలో పూరి జగన్నాథ్ ముంబైలో అద్దెకు ఉన్న ఫ్లాట్ కాళీ చేస్తున్నారని తెలుస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ సినిమా పూరి జగన్నాథ్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ సినిమా కనుక హిట్ అయి ఉంటే పూరి జగన్నాథ్ పర్మనెంట్ గా ముంబైకి పరిమితమయ్యేవారు అయితే ఈ సినిమా బెడిసి కొట్టడంతో ఆయన తిరిగి హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది.