విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించడం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయింది. లైగర్ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను స్టార్ ఛానల్ 85 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ దక్కించుకుందని సమాచారం అందుతోంది.
నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే ఈ సినిమా మేకర్స్ కు 99 కోట్ల రూపాయలు దక్కడం గమనార్హం. మరోవైపు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను వరంగల్ శ్రీను 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ హక్కులలో నైజాం హక్కులు ఆయన దగ్గరే ఉంటాయని సీడెడ్, ఆంధ్ర ఏరియాల హక్కులను మాత్రం వరంగల్ శ్రీను మళ్లీ విక్రయించనున్నారని సమాచారం అందుతోంది. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల జాబితాలో చేరినట్టేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టీ అమ్మే కుర్రాడు బాక్సర్ గా ఏ విధంగా గెలిచాడనే కథతో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం. ముంబై, ముంబై పరిసర ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా జరిగిందని తెలుస్తోంది. మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. పూరీ జగన్నాథ్ కు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ గత సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. లైగర్ మూవీ కొరకు విజయ్ దేవరకొండ ఏకంగా 25 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని తెలుస్తోంది.