‘బ్రహ్మాస్త్రం’ తో పాటు తెలుగులో మంచి కలెక్షన్లు సాధించిన 10 డబ్బింగ్ సినిమాల లిస్ట్..!

పెద్ద సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు… ఇలా మొత్తం కలుపుకొని నెలకు 30 నుండి 50 వరకు రిలీజ్ అవుతుంటే అందులో 2,3 సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. 2020 కోవిడ్ వల్ల లాక్ డౌన్ ఏర్పడడంతో 9 నెలల వరకు థియేటర్లు మూతపడ్డాయి. అటు తర్వాత రిలీజ్ అయిన సినిమాలను టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరించారు. కానీ ఎప్పుడైతే టికెట్ రేట్ల ఇష్యు ఏర్పడిందో..! అప్పటి నుండి ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. 2022 లో హిట్ పర్సెంటేజ్ భారీగా తగ్గిపోవడానికి అదొక కారణం అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ ఏడాది కొన్ని డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :

యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సాధించింది.

2) డాన్(2022) :

శివ కార్తికేయన్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా శిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించి హిట్ గా నిలిచింది.

3) విక్రమ్ :

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది. జూన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

4) విక్రాంత్ రోణ :

సుదీప్ హీరోగా అనూప్ బండారి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసి టాలీవుడ్ బయ్యర్స్ కు లాభాలను అందించింది.

5) బ్రహ్మాస్త్రం :

రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ మూవీ తెలుగులో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది.

6) గంగూబాయ్ కతియావాడి :

అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ గా మిగిలింది.

7) వలీమై :

అజిత్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకున్నప్పటికీ మంచి ఓపెనింగ్స్ సాధించింది. కానీ ఫైనల్ గా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

8) ఈటి(ఎవ్వరికీ తలవంచడు) :

సూర్య హీరోగా తెరకెక్కిన ఈ మాస్ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. ఫుల్ రన్లో ఈ మూవీ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

9) కోబ్రా :

విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది కానీ, టాక్ నెగిటివ్ గా ఉండడం వల్ల యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

10) బీస్ట్ :

విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది కానీ టాక్ నెగిటివ్ గా ఉండడం వల్ల ఫైనల్ గా బిలో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

Share.