Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ యముడి పాత్రలో కనిపించిన సినిమాలు ఇవే..!

గతవారం టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు అనారోగ్యంతో హైద‌రాబాద్‌లోని అపోలో హాస్పిట‌ల్లో చేరిన సంగతి తెలిసిందే. దాంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. అయితే ఈ విషయంలో ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదని.. వైద్య చికిత్సకి ఆయన శరీరం సహకరిస్తుందని కైకాల గారి కూతురు శ్రీమతి రమాదేవి చెప్పడంతో అందరూ టెన్షన్ నుండీ బయటపడ్డారు.ఈ మధ్య కాలంలో ఎక్కవ సినిమాల్లో కైకాల గారు కనిపించడం లేదు.

అయితే వార్తలతో ఆయన మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇదిలా ఉండగా.. అప్పట్లో ఈయన కూడా స్టార్ యాక్టర్ అన్న సంగతి తెలిసిందే. ఎన్నో వైవిధ్యమైన, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించారు. అయితే ఈయనకి యముడి పాత్రలు టైలర్ మేడ్ అనే విధంగా ఉండేవి. ‘యముండ’ అని ఈయన గర్జిస్తే నిజంగా యముడు ఇలాగే ఉంటాడేమో అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అయితే కైకాల సత్యనారాయణ గారు ఎన్ని సినిమాల్లో యముడిగా కనిపించారో ఓ లుక్కేద్దాం రండి :

1)యమగోల : సీనియర్ ఎన్టీఆర్ హీరోగా జయప్రద హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ గారు యముడిగా కనిపించి అలరించారు. తాతినేని రామారావు తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

2) యముడికి మొగుడు : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి తెరకెక్కించారు. ఈ మూవీలో యముడి పాత్రలో సత్యనారాయణ గారు అద్భుతంగా నటించి అలరించారు.

3)యమలీల : ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కూడా యముడిగా కైకాల సత్యనారాయణగారు అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు.

4)యమగోల మళ్ళీ మొదలైంది : శ్రీకాంత్,వేణు లు హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి తెరకెక్కించాడు. ఈ చిత్రంలో రిటైర్ అయ్యే యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ కనిపించారు.

5)దరువు : రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రానికి ‘సిరుతై’ శివ దర్శకుడు. ఈ చిత్రంలో కూడా కైకాల సత్యనారాయణ గారు రిటైర్ అవుతున్న యముడిలా కనిపించారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus