‘బాహుబలి'(సిరీస్) తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎన్టీఆర్, రాజమౌళి వంటి బడా స్టార్లతో జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం దేశవిదేశాల్లోని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఏకంగా 2ఏళ్ళు కేటాయించాడు. 2019,2020 సంవత్సరాలలో ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కరోనా పాండమిక్ సిట్యుయేషన్ లేకపోయినా.. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 2020 లో విడుదలయ్యే అవకాశం లేదని..
2021 జనవరి 8నే విడుదలవుతుందని దర్శకనిర్మాతలు అప్పటికే అధికారికంగా ప్రకటించారు. దాంతో 2021 లో ఎన్టీఆర్ తాను చెయ్యబోయే తరువాత సినిమాల పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. వీలైతే 2022 లో రెండు సినిమాలను విడుదలయ్యేలా ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో సినిమా చెయ్యబోతున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో పాటు ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానాతో కూడా ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి.
వీళ్ళతో పాటు తమిళ దర్శకుడు అట్లీ కూడా ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడం కోసం చాలా రోజుల నుండీ వెయిట్ చేస్తున్నాడు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్లో ఈ క్రేజీ ప్రాజెక్టు రూపొందే అవకాశం ఉంది.అంతేకాదు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల వంటి దర్శకులు కూడా ఎన్టీఆర్ కోసం కథలు రెడీ చేసుకుంటున్నారు.