లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తమిళంలో స్టార్ డైరెక్టర్. ఇతని సినిమాలకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ‘ఖైదీ’ ‘విక్రమ్’ వంటి సినిమాలకి తెలుగులో కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ‘మాస్టర్’ ‘లియో’ వంటి సినిమాలకి నెగిటివ్ టాక్ వచ్చినా… ఇక్కడ కమర్షియల్ సక్సెస్..లు అందుకున్నాయి. అయితే భారీ అంచనాల నడుమ వచ్చిన ‘కూలీ’ బాగా డిజప్పాయింట్ చేసింది.
ఇది కూడా తెలుగు రాష్ట్రాల్లో సేఫ్ అయినా.. కంటెంట్ పరంగా మాత్రం లోకేష్ కనగరాజ్ పై విమర్శలు కురిశాయి. అప్పటివరకు మహేష్ బాబు,రాంచరణ్ వంటి స్టార్ హీరోలు లోకేష్ తో పనిచేసేందుకు ఉత్సాహం చూపించినట్టు ప్రచారం జరిగింది. కానీ ‘కూలీ’ రిజల్ట్ తో ఆ వార్తలకు ఫుల్స్టాప్ పడినట్టు అయ్యింది. అయినప్పటికీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లోకేష్ తో సినిమాలు చేసేందుకు రెడీగానే ఉన్నారు.

ఇటీవల ‘మైత్రి మూవీ మేకర్స్’ నుండి లోకేష్ కనగరాజ్ కి అడ్వాన్స్ అందిందని సమాచారం. వాస్తవానికి చాలా రోజుల నుండి దీనిపై టాక్ నడుస్తుంది. కానీ ఇప్పుడు ఫైనల్ అయినట్టు టాక్. అయితే హీరో ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి అడ్వాన్స్..లు టాలీవుడ్ స్టార్ హీరోలందరి దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు ఏ హీరోతో లోకేష్ సినిమా సెట్ చేస్తారు? అంటే కచ్చితంగా ఒకరి పేరు చెప్పలేం.
కానీ పవన్ కళ్యాణ్, ప్రభాస్ పేర్లు మాత్రం కొంచెం ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే తమిళ హీరోల్లో కూడా కొంతమంది ‘మైత్రి’ వారి అడ్వాన్సులు అందుకున్నారు. వాళ్లలో కూడా హీరో ఫిక్స్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.
