‘సురేష్ ప్రొడక్షన్స్’ అధినేత సురేష్ బాబు చాలా కూల్ పర్సన్. ఎలాంటి గందరగోళానికి గురిచేసే ప్రశ్నకైనా బ్యాలన్స్డ్ గా సమాధానం చెప్పగల సమర్థత కలిగిన వ్యక్తి. అలాంటి సురేష్ బాబు ఈ మధ్య సహనం కోల్పోయినట్టు స్పష్టమవుతుంది. మొన్నామధ్య ‘హరిహర వీరమల్లు’ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ల సమస్య వచ్చినప్పుడు.. ఛాంబర్లో డోర్ తన్నుకుంటూ బయటకు వెళ్లి తన అసహనాన్ని బయట పెట్టారు.
ఇప్పుడు మరోసారి తన కోపాన్ని బయటపెట్టి హాట్ టాపిక్ అయ్యారు. ఈరోజు ‘సైక్ సిద్’ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన సురేష్ బాబుకి ‘అఖండ 2’ విడుదల నిలిచిపోవడం గురించి ప్రశ్న ఎదురైంది. ఆయన కూడా ‘ఆ సమస్య తీర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని’ సమాధానం ఇచ్చి సర్దిచెప్పాలని చూశారు. అక్కడితో ఆగకుండా రిపోర్టర్లు దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసేందుకు ప్రయత్నించారు.

అందువల్ల సురేష్ బాబు సహనం కోల్పోయారు.’గతంలో కూడా చాలా సినిమాలు ఆర్థిక లావాదేవీల కారణంగా రిలీజ్ కి ఇబ్బంది పడ్డాయి. అవి కామన్. అలాంటి సమస్యల గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు.కానీ ఎవరికి తోచినట్టు వాళ్లకి.. ఇంత కట్టాలి… అంత కట్టాలి అంటూ రాసేస్తున్నారు. అది చాలా బ్యాడ్.నిర్మాతలు ప్రేక్షకులకు సినిమాని చూపించాలని ప్రయత్నిస్తున్నారు.ప్రేక్షకులు సినిమా చూస్తారు.త్వరగా ఇష్యూ క్లోజ్ అవ్వాలని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు సురేష్ బాబు. సురేష్ బాబు కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సురేష్ బాబు కూడా స్టార్ ప్రొడ్యూసర్. ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు నిర్మించారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.
