‘విక్రమ్’తో LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) సృష్టించి, ఇండియన్ సినిమాలోనే ట్రెండ్ సెట్టర్‌గా మారిన లోకేష్ కనగరాజ్, ‘కూలీ’తో పెద్ద దెబ్బతిన్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చేసిన ఆ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్‌గా మిగిలింది. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా మాయకముందే, ఇప్పుడు కోలీవుడ్‌లో మరో సంచలన టాక్ మొదలైంది. లోకేష్.. సోషల్ మీడియాలో రజినీకాంత్‌ను ‘అన్‌ఫాలో’ చేశాడన్న వార్త ఇప్పుడు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. ఇది కేవలం టెక్నికల్ గ్లిచ్ కాదు, దీని వెనుక పెద్ద గొడవే జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
Lokesh Vs Rajini
‘కూలీ’ ఫ్లాప్ తర్వాత, లోకేష్ తన ఇమేజ్‌ను, రజినీతో తన రిలేషన్‌ను దిద్దుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడట. అదే, తన గురువు కమల్ హాసన్‌ను, లెజెండ్ రజినీకాంత్‌ను కలిపి దశాబ్దాల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చూపించే మెగా మల్టీస్టారర్. ఈ స్క్రిప్ట్‌పై లోకేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడని, ఇది తన కెరీర్‌కే మైల్‌స్టోన్ అవుతుందని భావించాడని కోలీవుడ్ టాక్. ఫ్యాన్స్ కూడా ఈ కాంబో కోసం ఆశగా ఎదురుచూశారు. ‘కూలీ’తో పడిన మచ్చను, ఈ లెజెండరీ కాంబోతో లోకేష్ చెరిపేస్తాడని అంతా ఫిక్స్ అయ్యారు.
అయితే, లోకేష్ ప్లాన్ బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. ఈ భారీ మల్టీస్టారర్ కథను ఇద్దరు లెజెండ్స్ తిరస్కరించినట్లు సమాచారం. డైరెక్టర్‌ను రజినీ, కమల్ నమ్మలేకపోయారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ‘కూలీ’ ఇచ్చిన అనుభవంతో, లోకేష్‌తో మరో ప్రయోగానికి రజినీ సిద్ధంగా లేకపోవడం వల్లే ‘నో’ చెప్పారని, ఈ రిజక్షన్‌నే లోకేష్ జీర్ణించుకోలేకపోతున్నాడని అంటున్నారు. ఈ రిజక్షన్‌తో తీవ్రంగా హర్ట్ అయిన లోకేష్, ఇలా ‘అన్‌ఫాలో’ రూపంలో చూపించాడని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.
ఫ్యాన్స్ ఈ మార్పును వెంటనే పసిగట్టి, “ఏమైంది బ్రో?”, “కూలీ గొడవ ఇంకా అయిపోలేదా?” అంటూ కామెంట్లతో మోతెక్కిస్తున్నారు. ‘LCU’తో ఒక సామ్రాజ్యాన్నే సృష్టించిన లోకేష్, ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ రిజెక్ట్ కావడంతో, అది కూడా రజినీకాంత్ వల్లే అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఏదేమైనా, ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ లేదా చిన్న అపార్థం మాత్రమే అయ్యిండాలని, ఈ ఇద్దరూ త్వరలోనే కలిసిపోయి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాలని కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికి, ఈ ‘అన్‌ఫాలో’ డ్రామా మాత్రం కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది.
