కరోనా కేసులు తగ్గి థియేటర్లు తెరుచుకోవడంతో ఆగష్టు నెలలో రాజరాజచోర, ఎస్.ఆర్ కళ్యాణమండపం, శ్రీదేవి డ్రామా సెంటర్ సినిమాలు విడుదలై సక్సెస్ సాధించాయి. ఈ సినిమాల ఫలితాల వల్ల సెప్టెంబర్ నెలలో ఏకంగా 31 సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలలో అనువాద సినిమాలు కూడా ఉండటం గమనార్హం. మొత్తం 31 సినిమాలలో తెలుగు సినిమాలు 20 కాగా మిగిలిన సినిమాలు అనువాద సినిమాలుగా ఉన్నాయి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ 7 సినిమాలు రిలీజయ్యాయి.
ఈ సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమాలు నూటొక్క జిల్లాల అందగాడు, షేంగ్ ఛీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 కాగా ఈ సినిమాలలో ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వారం తలైవి, సీటీమార్, టక్ జగదీష్ సినిమాలతో పాటు మరో నాలుగు సినిమాలు రిలీజ్ కాగా సీటీమార్ కు పాజిటివ్ టాక్ వచ్చినా ఫుల్ రన్ లో భారీస్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఆ తర్వాత వారం ఏకంగా 9 సినిమాలు రిలీజయ్యాయి.
సెప్టెంబర్ మూడో వారంలో రిలీజైన సినిమాలలో మాస్ట్రో ఓటీటీలో రిలీజ్ కాగా ఈ సినిమా కూడా యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని నటించిన అనువాద చిత్రాలు సెప్టెంబర్ మూడో వారంలో విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచాయి. సందీప్ కిషన్ గల్లీ రౌడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. నాలుగో వారం ఐదు సినిమాలు రిలీజ్ కాగా విడుదలైన సినిమాలలో లవ్ స్టోరీ మాత్రమే హిట్టైంది. సెప్టెంబర్ నెలాఖరులో నో టైమ్ టు డై సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. హీరో నాగచైతన్య సెప్టెంబర్ విజేతగా నిలవడం గమనార్హం.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!