‘హరోం హర’ వంటి యాక్షన్ మూవీ తర్వాత సుధీర్ బాబు (Sudheer Babu) నుండి వచ్చిన ‘మా నాన్న సూపర్ హీరో'(Maa Nanna Superhero) . ‘వి సెల్యులాయిడ్స్’ ‘కామ్ ఎంటర్టైన్మెంట్’.. సంస్థల పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు.అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చూపలేదు.దసరా సెలవులను కూడా ఎంత మాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది ఈ సినిమా.
Maa Nanna Superhero Collections
ఒకసారి (Maa Nanna Superhero) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రానికి రూ.4.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.2 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.1.08 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.4.12 కోట్ల షేర్ ను రాబట్టాలి.