సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా ‘హరోం హర’ వంటి యాక్షన్ మూవీ తర్వాత వచ్చిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero) . దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రాన్ని ‘వి సెల్యులాయిడ్స్’ ‘కామ్ ఎంటర్టైన్మెంట్’..సంస్థల పై సునీల్ బలుసు నిర్మించారు. షాయాజీ షిండే(Sayaji Shinde), సాయి చంద్ (Sai Chand) ..లు కీలక పాత్రలు పోషించడం జరిగింది.మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది..కానీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ మినిమమ్ కూడా రాలేదు.
Maa Nanna Superhero Collections:
దసరా సెలవులను ఎంత మాత్రం క్యాష్ చేసుకోలేకపోయిన ఈ ఫుల్ రన్లో(Maa Nanna Superhero) ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రానికి రూ.4.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.2 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.1.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.ఇవి కూడా నెగిటివ్ షేర్స్ వంటివి కాకుండా..! ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ కి రూ.3.97 కోట్ల దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది.