నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్..లు హీరోలుగా రూపొందిన ‘మ్యాడ్’ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందింది. మొదటి నుండి దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ప్రోమోస్ వంటివి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. దీంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రియాంక జవాల్కర్, రెబా మోనికా జాన్ కూడా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేయడం కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.
Mad Square Collections:
ఇక మార్చి 28న రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాకు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.20.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.9.86 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.11.14 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా రూ.18.2 కోట్లు కొల్లగొట్టింది.