Mad Square Collections: వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మ్యాడ్ స్క్వేర్’ !
- March 31, 2025 / 03:03 PM ISTByPhani Kumar
నార్నె నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Shobhan), రామ్ నితిన్(Ram Nithin)..లు హీరోలుగా రూపొందిన ‘మ్యాడ్’ (MAD) సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) రూపొందింది. మొదటి నుండి దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ప్రోమోస్ వంటివి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. దీంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) , రెబా మోనికా జాన్ (Reba Monica John) కూడా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేయడం కూడా అట్రాక్షన్ అని చెప్పాలి.
Mad Square Collections:

ఇక మార్చి 28న రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో కథ పెద్దగా లేకపోయినా కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందని ఆడియన్స్ తెలిపారు. దీంతో ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 7.41 cr |
| సీడెడ్ | 2.00 cr |
| ఉత్తరాంధ్ర | 1.98 cr |
| ఈస్ట్ | 1.32 cr |
| వెస్ట్ | 0.60 cr |
| గుంటూరు | 1.19 cr |
| కృష్ణా | 0.90 cr |
| నెల్లూరు | 0.51 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 15.91 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.27 cr |
| ఓవర్సీస్ | 4.72 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్ ) | 21.90 కోట్లు(షేర్) |
‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square ) సినిమాకు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.21.9 కోట్లు షేర్ ను రాబట్టింది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. రాబోయే రోజుల్లో మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.












