యూత్ ను బాగా ఆకట్టుకున్న కామెడీ మూవీ “మ్యాడ్” (MAD) టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) , నార్నే నితిన్ (Narne Nithin), రామ్ నితిన్ (Ram Nithin) లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం చిన్న సినిమాగా మొదలై పెద్ద విజయాన్ని సాధించింది. కాలేజ్ లైఫ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ నవ్వులు పూయించడంలో సక్సెస్ అయ్యింది. ఆ విజయానికి కొనసాగింపుగా “మ్యాడ్ స్క్వేర్” (Mad Square) పేరుతో సీక్వెల్ ప్లాన్ చేసిన మేకర్స్, ప్రాజెక్టును చాలా వేగంగా ప్రారంభించారు.
Mad Square
ఈసారి కథలో కొంత మార్పులు చేసి, ముగ్గురు హీరోల ఫ్యామిలీ లైఫ్‌ని హాస్య భరితంగా చూపించబోతున్నారని తెలుస్తోంది. “మ్యాడ్ స్క్వేర్” లో కొంత భాగం షూటింగ్ పూర్తయి, మిగతా పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo ) , ఇప్పటికే విడుదల చేసిన “లడ్డూ గాని పెళ్లి సాంగ్” సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సాంగ్ సినిమాకు హైలైట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
మొదటి భాగం డైరెక్టర్ కల్యాణ్ శంకర్ ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాతలు సూర్యదేవర హారిక (Suryadevara Naga Vamsi) , సాయి సౌజన్యలు (Sai Soujanya) సైతం సీక్వెల్ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈసారి హీరోయిన్ కాస్ట్‌లో మార్పులు చేసినట్లు టాక్. శ్రీగౌరి ప్రియా రెడ్డి(Sri Gouri Priya ) , అనంతిక సనీల్‌కుమార్(Ananthika Sanilkumar), గోపిక (Gopikaa Udyan) వంటి నటుల స్థానంలో కొత్త ఫేసెస్ ని పరిచయం చేస్తారని అంటున్నారు. మూవీ మొదట జనవరి విడుదలకు ప్లాన్ చేసిన మేకర్స్, ఇతర పెద్ద సినిమాల పోటీ కారణంగా ఫిబ్రవరిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి మధ్యలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. “మ్యాడ్” చిత్రం సాధించిన విజయాన్ని కొనసాగించడానికి “మ్యాడ్ స్క్వేర్” మరింత ఆకట్టుకునే విధంగా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.