ఈ ఏడాది టాలీవుడ్ గ్రౌండ్ లో మన స్టార్ హీరోలు బాక్సాఫీస్ (Box-Office) బ్యాటింగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. బిగ్ హిట్స్, పాన్ ఇండియా సిక్సర్లతో తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్ కు వెళ్ళిందనే చెప్పాలి. టాలీవుడ్ స్టార్స్‌కి తమ సత్తా ఏంటో మరోసారి నిరూపించుకునే అవకాశం దక్కింది. ముఖ్యంగా ఇద్దరు హీరోలు 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి, భారతీయ సినిమాల్లో టాలీవుడ్ దిశానిర్దేశకులుగా మారారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’తో (Pushpa 2: The Rule) మరో స్థాయికి వెళ్లిపోయాడు.
Box-Office
ఈ సినిమా విడుదలైన రోజే రికార్డు వసూళ్లు నమోదు చేసి, ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించింది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ (Sukumar) కథన శైలి, దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఈ చిత్రం కేవలం 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1375 కోట్ల గ్రాస్ సాధించి, 2024 బాక్సాఫీస్ రేసులో అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది మరో బిగ్ బ్లాక్‌బస్టర్ ను అందించాడు.
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంతో ప్రభాస్ రెండోసారి 1000 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమా మొత్తం 1020 కోట్ల వసూళ్లు సాధించి, అతని స్టార్‌డమ్‌ను మరింత పెంచింది. ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా సెన్సేషన్‌గా మరింత నిలకడగా నిలిచాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర పార్ట్ 1’తో (Devara) బాక్సాఫీస్ వద్ద అదరగొట్టాడు. 420 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఎన్టీఆర్ తన మార్క్‌ను మరోసారి చూపించాడు. ఈ సినిమాలో ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అయితే అద్భుతమైన కలెక్షన్లతో అందరినీ ఆశ్చర్యపరిచిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman) . తేజా సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన ఈ సినిమా 296 కోట్ల గ్రాస్ సాధించి, టాప్ 4 స్థానంలో నిలిచింది. మరోవైపు మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) 175 కోట్ల గ్రాస్ సాధించినప్పటికీ, యావరేజ్ టాక్ తోనే నిలిచింది. ‘టిల్లు స్క్వేర్’తో (Tillu Squre) రౌడీ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) , ‘లక్కీ భాస్కర్’తో (Lucky Baskhar) దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , ‘సరిపోదా శనివారం’తో (Saripodhaa Sanivaaram) నాని (Nani) కూడా ఈ ఏడాది 100 కోట్లను టచ్ చేశారు. దీంతో వీరు కూడా టాప్ 10 బాక్సాఫీస్ విన్నర్స్ జాబితాలో చేరారు.