1994లో అన్యాయంగా జైలుపాలైన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కింది. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన ఆ చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. జులై 1న విడుదల కానున్న ఈ సినిమా గురించి మాధవన్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. దాంతోపాటు నంబి నారాయణన్‌కు సంబంధించిన విస్తుపోయే విషయాలూ వెల్లడించారు. ‘విక్రమ్ వేద’ సినిమా సమయంలో నంబి నారాయణన్ గురించి వార్తలు చదివారట మాధవన్.
నంది నారయణన్‌కు మాల్దీవులకు చెందిన అమ్మాయితో సంబంధం ఉందని, మన దేశ రాకెట్ సాంకేతికతను ఆయన రహస్యంగా పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారని అప్పట్లో అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయన్ను చిత్ర హింసలు పెట్టారని వార్తలొచ్చాయి. అయితే సీబీఐ చేపట్టిన దర్యాప్తులో ఆయన నిరపరాధిగా రుజువయ్యారనేది ఆ వార్తల ద్వారా తెలుసుకున్నారట మాధవన్. ఈ ఘటనల ఆధారంగా సినిమా తీస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచన అప్పుడే మొదలైందట. ఈ విషయం మీద ఆసక్తితో ఐదేళ్ల క్రితం నంబి నారాయణన్‌ను త్రివేండ్రంలో కలిశారట మాధవన్.
అప్పుడు ఆయన బోనులో ఉన్న సింహంలా కనిపించారట. తన ఆలోచనను మాధవన్ చెప్పేసరికి ‘నన్ను దేశ ద్రోహి అని ఎలా అంటారు?’ అంటూ ఆయన చాలా కోపంగా మాట్లాడారట. ‘మీరు నిర్దోషి అని నిరూపితమైంది కదా’ అని మాధవన్ అంటే ‘అది నాకూ నీకూ కోర్టుకు మాత్రమే తెలుసు’ అని ఇంకా కోపంగా అన్నారట. ‘అంతెందుకు గూగుల్‌లో వెతికినా నా గురించి గూఢచారి అనే సమాధానమే వస్తుంది’ అని ఆవేదనకు లోనయ్యారట నంబి.
నంబి నారాయణన్ ప్రిన్స్‌టెన్ యూనివర్శిటీలో చదువుకున్నారు. రీసెర్చ్ కోసం అక్కడివారంతా ఐదారేళ్ల సమయం తీసుకుంటే అతను మాత్రం పది నెలల్లోనే పూర్తి చేశారట. నంబి చేసిన సాహసాల గురించి వినగానే ‘జేమ్స్ బాండ్’ బాబులా అనిపించారట మాధవన్‌కి. నంబి నారాయణన్ ఓ రాక్ స్టార్ అని పొగిడేశారు మాధవన్.ఇక సినిమా గురించి చెబుతూ… ఈ సినిమా పూర్తవ్వడానికి ఆరేళ్లు పట్టింది. ఇందులో రాకెట్ ఇంజిన్ వ్యవస్థ గురించి చూపిస్తున్నాం. ‘బాహుబలి’ని రూపొందించేందుకు ఆ చిత్ర బృందం ఎంత కష్టపడిందో… మా టీమ్ కూడా అంతే కష్టపడింది అని మాధవన్ వివరించారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!