టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రం విడుదలయ్యి మూడు వారాలు అవుతున్నప్పటికీ మంచి వసూళ్ళనే సాధిస్తుంది. 3 వ వారంలో కూడా మహేష్ చిత్రానికి పెద్దగా పోటీలేదనే చెప్పాలి. నిన్న విడుదలైన ‘సీత’ చిత్రం కూడా ప్లాప్ టాక్ నే సొంతం చేసుకుంది. దీంతో మళ్ళీ ఈవెనింగ్ షోస్ అన్నీ ‘మహర్షి’ నే వెతుక్కుంటూ వచ్చాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహేష్ 25 వ చిత్రంగా వచ్చిన ‘మహర్షి’ ఇప్పటికే 90 కోట్ల షేర్ ను దాటేసింది. ఎంతకాదనుకున్నా వీక్ డేస్ లో 90 లక్షల నుండే 1 కోటి రూపాయల వరకూ షేర్ ను రాబడుతూ వచ్చింది ఈ చిత్రం. మరో 7 రోజులు ఇదే జోరు కొనసాగిస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ చేరుకోవడం ఖాయం.
ఈ చిత్రానికి 95 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వచ్చే వారం విడుదలయ్యే ‘ఎన్జీకే’ ‘ఫలక్ నుమా దాస్’ చిత్రాల పోటీను తట్టుకుంటే ‘మహర్షి’ చిత్రం 100 కోట్ల షేర్ ను అందుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని మహేష్ ఎంత వరకూ ఉపయోగించుకుంటాడో చూడాలి. అయితే ఓవర్సీస్, మరియు సీడెడ్ లో మాత్రం ఈ చిత్రానికి నష్టాలు తప్పేలా లేవు. ఏదేమైనా ఈ చిత్రం ఓవర్ ఆల్ గా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ స్టేటస్ దక్కించుకునే అవకాశం ఉంది. అంతేకాదు మహేష్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కూడా టాప్ ప్లేస్ కొట్టేస్తుంది. మరి 100 కోట్ల షేర్ ను అందుకుంటుందా? లేదా? అనేది చూడాలి.