పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడం విశేషం. ఒరిజినల్ తో పోలిస్తే ఆయన ఈ సినిమాలో చాలా మార్పులు చేసాడని నిర్మాత నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అసలు ఈ చిత్రం చూస్తే ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ గుర్తుకు రాదని… ‘అజ్ఞాతవాసి’ ప్లాప్ ను కూడా మర్చిపోయేలా ఈ చిత్రం చేస్తుందని ధీమా వ్యక్తం చేసాడు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల కాబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించినప్పటికీ విడుదల తేదీ పై అందరికీ అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఫిబ్రవరి 25నే ఈ మూవీ విడుదల కాబోతుందని ‘భీమ్లా’ టీం చాల కాన్ఫిడెంట్ గా చెబుతుంది. ఫిబ్రవరి 20 లేదా ఫిబ్రవరి 21న ‘భీమ్లా’ ప్రీ రిలీజ్ వేడుకని నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈ వేడుకకి ముఖ్య అతిథిలుగా మహేష్ బాబు, రాజమౌళి విచ్చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మహేష్ బాబు తర్వాతి మూవీ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లోనే చేయాల్సి ఉంది. దానికి త్రివిక్రమే దర్శకుడు కాబట్టి.. మహేష్ ఈ వేడుకకి హాజరుకాబోతున్నట్టు స్పష్టమవుతుంది. ఇక మహేష్ తో రాజమౌళి ఓ మూవీ చేయబోతున్నాడు. అదీ కాక రాజమౌళి ప్రతీ పెద్ద సినిమా వేడుకకి అతిథిగా వెళ్లడం ఒక ఆనవాయితీగా కూడా మారింది.
ఏది ఏమైనా వీళ్ళిద్దరూ కనుక గెస్ట్ లుగా వస్తే.. సినిమాకి మరింత అట్రాక్షన్ చేకూరుతుంది. దాంతో పాటు మహేష్- పవన్ లను కలిసి చూడాలని వీళ్ళ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయం పై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. హైదరాబాద్లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరుగనుందని సమాచారం.