Mahesh Babu: ఆ వార్తల వల్ల మహేష్ ఇబ్బంది పడుతున్నారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతరులకు తన వంతు సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటారు. చీమకు కూడా మహేష్ బాబు హాని తలపెట్టరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తండ్రి మరణం వల్ల మహేష్ బాబు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. అయితే కృష్ణ మరణించినప్పటి నుంచి మహేష్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తల్లో కొన్ని వార్తలు పాజిటివ్ గా ఉంటే మెజారిటీ వార్తలు నెగిటివ్ గా ఉన్నాయి.

ప్రధానంగా నరేష్ మహేష్ బాబు మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు ప్రచారంలోకి రావడం మహేష్ ను బాధ పెడుతున్నట్టు తెలుస్తోంది. తన బాధలో తాను ఉంటే ఇలాంటి వార్తలు ప్రచారంలోకి తెస్తూ తనను మరింత బాధ పెడుతున్నారని మహేష్ అభిప్రాయపడుతున్నారని సమాచారం. ఈ వార్తల గురించి స్పందించాలని కూడా అనుకోవడం మహేష్ సన్నిహితుల వద్ద చెబుతున్నారని బోగట్టా. మహేష్ బాబు ఈ వార్తల వల్ల మానసికంగా డిస్టర్బ్ అయ్యాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మహేష్ రక్త సంబంధీకులు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారనే బాధను ఆయన తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు వచ్చే నెల నుంచి మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొననున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కు 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మొదలుకానుంది.

వేగంగా ఈ సినిమా షూట్ ను పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేయనున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ప్రకటించిన రిలీజ్ డేట్ కు ఈ సినిమాను విడుదల చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus