ఆర్ఆర్ఆర్ మూవీ ఎంట్రీతో మహేష్ బాబు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల మహేష్ ఫ్యాన్స్ బాధ పడినా ఆర్ఆర్ఆర్ తో పోటీ పడకుండా మహేష్ మంచి పని చేశారనే కామెంట్లు వినిపించాయి. అయితే ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతికి భీమ్లా నాయక్ రిలీజైతే ఏపీ సర్కార్ టికెట్ల పెంపుకు అంగీకరించకపోవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ నిర్ణయం ప్రభావం ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలపై పడనుంది.
భీమ్లా నాయక్ సంక్రాంతికి రిలీజ్ కాకపోతే మాత్రం టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. అయితే ఈ సమస్యతో సంబంధం లేకుండా సర్కారు వారి పాటను మహేష్ ఏప్రిల్ కు వాయిదా వేయడంతో ఆ సమయానికి ఏపీలో టికెట్ రేట్లు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఏప్రిల్ నెల 1వ తేదీన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ కానుంది. సమ్మర్ లో సోలోగా రిలీజ్ కావడం వల్ల సర్కారు వారి పాటకు భారీస్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
రాజకీయ వివాదాలకు సర్కారు వారి పాట దూరంగా ఉంటేనే మంచిదని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. 100 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుస విజయాలతో జోరుమీదున్న మహేష్ సర్కారు వారి పాటతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.