అసలే ఎన్టీఆర్ జైలవకుశ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. మరో పక్క ఈ వారం ప్రిన్స్ సినిమా స్పైడర్ విడుదలకు సిద్దంగా ఉంది…మరి ఇలాంటి సమయంలో ప్రిన్స్ ఫ్యాన్స్ ఎందుకు గందరగోళంలో ఉన్నారు అంటే…ఒకసారి ఈ కధ చదవండి…విషయంలోకి వెళితే…మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న ప్రిన్స్ సినిమా కధ విషయంలో రకరకాల ఊహాగానాలు బయట ప్రిన్స్ ఫ్యాన్స్ ని కాస్త కన్ఫ్యూషన్ లో పడేస్తే…ఈ సినిమా దర్శకుడు మురుగుదాస్ తాను ఇచ్చిన ఇంటర్‌వ్యూ లో మాట్లాడిన తీరి మరికొన్ని సందేహాలను ప్రిన్స్ ఫ్యాన్స్ లో నింపింది…ఇంతకీ మురుగుదాస్ ఏమన్నాడు అంటే…కేవలం ‘ఒకటి, రెండు రూపాయలకే వైద్యం చేసి, ఆనందపడే డాక్టర్లను ప్రత్యక్షంగా చూసాను. సామాజిక సేవతో సంతృప్తి పొందేవాళ్ళను చూసాను. వాళ్ళల్లో ఉన్న మానవత్వం నాకు నచ్చింది.
ఈ కధ రాయడానికి అదే ప్రేరణ అని అంటున్నాడు…అక్కడితో ఆగకుండా…ఇప్పుడు అంతా ఇన్ స్టంట్ కాఫీ టూ మినిట్స్ లో వండే న్యూడిల్స్ రెడీమేడ్ మసాలాలతో పాటు చివరికి దేవుణ్ణి కూడా వేగంగానే ప్రార్ధిస్తున్నారు అని అంటూ రోడ్డు మీద వెళుతూ బయటనుంచే దేవుడికి దండం పెట్టుకుంటున్న ప్రజలు ఉన్న సమాజంలో పక్క వాళ్ళ గురించి పట్టించుకునే తీరిక కూడా ఉండడంలేదు అంటూనే, అదే క్రమంలో ఏ విషయంలో అయినా వేగంగా ఉండొచ్చు కానీ అమ్మ, నాన్న, స్నేహితులు, బంధువులను ప్రేమించలేనంత తీరికలేకుండా ఉండకూడదు అని అంటూ రానురాను మానవత్వం అనేది తగ్గిపోతోంది అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు…బాగానే ఉంది కానీ… ఈ లీకులు అన్నీ చూస్తూ ఉంటే…నేటి స్పీడ్ యుగంలో ఫాస్ట్ యుగంలో ఫాస్ట్ గా దూసుకెళ్ళాలి గానీ ‘మానవత్వం’ మరిచిపోవద్దని ‘స్పైడర్’ లోని హీరో పాత్ర ద్వారా కమర్షియల్ కోణంలో చెబుతున్నట్లుగా ఉంది…సెంటిమెంట్ కి పెద్దగా చోటు లేని…ఈ స్పీడ్ యుగంలో ఈ సెంటిమెంటల్ కాన్సెప్ట్ ఎంతవరకూ రీచ్ అవుతుందో చూడాలి.